E-Paper
Advertisement

Bhagyashri Borse: ప్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన భాగ్యం.. ఇక రామ్ నే కాపాడాలి

Bhagyashri Borse: ప్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన భాగ్యం.. ఇక రామ్ నే కాపాడాలి
Advertisement

Bhagyashri Borse: ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే అసలు దాన్ని అంచనా కూడా వేయలేము. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సినిమాల మీద సినిమాలు చేస్తున్నా కూడా విజయాలను అందుకోలేని హీరోయిన్లు ఉన్నారు. తాజాగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే రెండో కేటగిరీకి చెందుతుంది అని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో భాగ్యశ్రీ తెలుగు తెరకు పరిచయమైంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ అందం, అభినయం చూసి తెలుగు నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఈమెనే అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

సినిమా రిలీజ్ అవ్వకముందే భాగ్యశ్రీ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టింది అంటే ఆమెకు ఎంత ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్లాప్ అయినా కూడా భాగ్యశ్రీ కి మాత్రం మంచి మార్కలే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ లో ముద్దుగుమ్మ నటించింది. మిస్టర్ బచ్చన్  పోతే పోయింది కింగ్డమ్ అయినా భాగ్యశ్రీ కి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది అనుకున్నారు. కానీ, మళ్ళీ ఆమెకు నిరాశ ఎదురయ్యింది.  ఆ సినిమాలో అమ్మడు నటించిన సాంగ్ కూడా ఎడిటింగ్ లో తీసేసారు. దీంతో అసలు ఆ సినిమాలో భాగ్యశ్రీ ఎందుకు ఉందా అని అనుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా భారీ పరాజయాన్ని అందుకుంది.

Advertisement

అలా రెండు సినిమాలు వరుస పరాజయాలు అందుకోవడంతో భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడుతుందేమో అని చాలామంది భయపడ్డారు. ఇక భాగ్యశ్రీ నటించిన మూడో సినిమా ఎట్టకేలకు నిన్న రిలీజ్ అయ్యింది. మొదట భాగ్యశ్రీ తెలుగులో కన్నా తమిళ్ లోనే ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే కొద్దిగా లేటుగా రిలీజ్ అవ్వడంతో కాంత ఆమె మూడో సినిమాగా రిలీజ్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంత సినిమా ఎన్నో అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. తమిళ్ లో కొద్దో గొప్పో  పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా  తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తో కొనసాగుతుంది.

ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాకు హైలెట్ అంటే ఆమె అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమా హిట్ కాకపోయినా కూడా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. కానీ సక్సెస్ పరంగా ఈ చిన్నది హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది అని చెప్పొచ్చు.  ఇక ప్రస్తుతం అమ్మడు ఆశలన్నీ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలుకా సినిమా పైనే పెట్టుకుంది. కాంత ప్లాప్ అయినా ఈ నెలలోనే రిలీజ్ అవుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అయినా ఒక సక్సెస్ ను ఇస్తుందని అమ్మడు చాలా అంచనాలను పెట్టుకుంది. మరి ఈ సినిమాతో నైనా భాగ్యశ్రీ విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×