E-Paper
Advertisement

Viral Video: రైలు కదిలినా డబ్బులివ్వలేదు.. పరిగెట్టి పరిగెట్టి కన్నీళ్లు పెట్టుకున్న చిరు వ్యాపారి!

Viral Video: రైలు కదిలినా డబ్బులివ్వలేదు.. పరిగెట్టి పరిగెట్టి కన్నీళ్లు పెట్టుకున్న చిరు వ్యాపారి!
Advertisement

Bangladesh Coolie Viral Video: మనుషులలో రోజు రోజుకు మానత్వం కనిపించకుండా పోతుంది. కొంత మంది మరీ పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.రైల్వే స్టేషన్‌ లో స్నాక్స్ అమ్ముతున్న ఓ యువకుడి నుంచి ఓ ప్రయాణీకుడు కొన్ని స్నాక్స్ కొనుగోలు చేశాడు. డబ్బులు ఇవ్వకుండానే రైలెక్కాడు. అదే సమయంలో రైలు కదలడంతో.. ఆ యువకుడు డబ్బులు ఇవ్వాలంటూ రైలు వెంట పరిగెత్తాడు. ఎంతకూ ఇవ్వకపోవడంతో ఆ యువకుడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడయో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు ప్రయాణీకుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ యువకుడిపై జాలిపడుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 

ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. ఈ వీడియోను సోజోల్ అలీ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ యువకుడు వేగంగా కదులుతున్న రైలు పక్కన పరుగెత్తుతూ, డబ్బులు ఇవ్వాలని పదే పదే అడుగుతూ,  ప్రయాణీకుడు కూర్చున్న కంపార్ట్‌ మెంట్ వైపు చూస్తూ పిలుస్తున్నట్లు కనిపించింది. అతడు అంతలా పరిగెత్తుతూ వస్తున్నా రైలు లోపలి నుంచి ఎవరూ స్పందించలేదు. ఈ వీడియోను నెటిజన్లు ఎంతో బాధపడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా స్నాక్స్ తీసుకున్న ప్రయాణీకుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

Advertisement

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ రైల్వే వెండర్ బాధను చూసి అయ్యో అంటున్నారు. అంత పరిగెత్తినా తన డబ్బులు పొందలేకపోవడాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న వస్తువులకు డబ్బులు ఇవ్వాలనే కనీస మానవత్వం లేని మనుషులను చూడ్డం నిజంగా దారుణమని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. కష్టజీవుల విషయంలో గౌవరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు. “డబ్బు చెల్లించని వ్యక్తి పట్ల నాకు జాలిగా ఉంది. ఎందుకంటే త్వరలోనే అతడు తగిన శిక్షను అనుభవిస్తాడు. యువ రైల్వే వెండర్ కు ఏదో ఒకరకంగా మంచి జరగాలని కోరుకుంటున్నాడు. భగవంతుడు తనని చల్లగా చూడాలని వేడుకుంటున్నా” అని కామెంట్ పెట్టాడు. “ఆ పిల్లాడు రైలు వెంట పరిగెత్తుతూ వస్తుంటే నాకు బాధగా ఉంది. మనుషులు మరీ ఇంత మూర్ఖంగా వ్యవహరించడం మంచిది కాదు. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునే వ్యక్తులను ఇలా వేధించడం సరికాదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి అమాయకులను వేధించే వారికి కర్మ అనేది కచ్చితంగా తిరిగి వస్తుంది. కాకపోతే కాస్త టైమ్ పట్టవచ్చు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “చిన్న వ్యాపారులు తక్కువ మొత్తంలో లాభం తీసుకుంటూ తమ కుటుంబాలని పోషించుకుంటారు. అలాంటి వారిని వేధించడం సరికాదు. ఇలాంటి క్రూరత్వం, దయలేని పనులు అస్సలు చేయకూడదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: రైలు కిందకి దూరి పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. వెంటనే అతడు ఏం చేశాడంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×