E-Paper
Advertisement

BMW Film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆ డైరెక్టర్ బయోపిక్ సినిమానా…ఈ యాంగిల్ కూడా ఉందా!

BMW Film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆ డైరెక్టర్ బయోపిక్ సినిమానా…ఈ యాంగిల్ కూడా ఉందా!
Advertisement

BMW Film: మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (BMW) సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయిన భర్త కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కిషోర్ తిరుమల బయోపిక్..

ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ మాట్లాడుతూ ఈ సినిమా గురించి నాకు ఒక రూమర్ వినిపించింది ఈ సినిమా డైరెక్టర్ కిషోర్ తిరుమల బయోపిక్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి నిజమేనా? అంటూ సుమా ప్రశ్న వేయడంతో కిషోర్ తిరుమల సమాధానం చెబుతూ ఇది అసలు నా బయోపిక్ సినిమా కాదని తెలిపారు. అయితే రవితేజ మాత్రం ఈ విషయంపై మాట్లాడుతూ ఇది కిషోర్ బయోపిక్ సినిమా కాకపోయినా ఈ సినిమాపై కిషోర్ రియల్ లైఫ్ ఇంపాక్ట్ కొంతవరకు ఉంది అంటూ సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పెళ్లికి ముందు జీవితం..

Advertisement

ఇక ఇంటర్వ్యూలో భాగంగా తదుపరి చిత్రం గురించి కూడా కిషోర్ తిరుమల అప్డేట్ ఇచ్చారు .తన తదుపరి సినిమా నా పెళ్ళికి ముందు జరిగిన జీవితం గురించి ఒక సినిమా చేస్తాను అంటూ  ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఇప్పటివరకు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. మొదటిసారి రవితేజతో కలిసి ఈయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సరికొత్త కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకుంటారని స్పష్టమవుతుంది.

భక్త మహాశయులకు విజ్ఞప్తి పైనే ఆశలు..

Advertisement

ఈ సినిమాలో సునీల్, తారక్ పొన్నప్ప, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. మరి జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇటీవల వరుస సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. గత కొద్ది రోజుల క్రితం మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు ఈ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Abhishek Pathak: తండ్రి కాబోతున్న దృశ్యం 2 డైరక్టర్.. నటి శివాలిక బేబీ బంప్ ఫోటో వైరల్!

 

Related News

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

Big Stories

Advertisement
×