E-Paper
Advertisement

Ravi Teja Remuneration: భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Ravi Teja Remuneration: భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Ravi Teja Remuneration: సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి నేపథ్యం లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన ఆయన ప్రయాణం నేడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు 75 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ త్వరలోనే తన తదుపరి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రవితేజ రెమ్యూనరేషన్…

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్లలో భాగంగా సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత చెరుకూరి సుధాకర్ గురించి ప్రస్తావనకు రావడంతో ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఆయన మీరు రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పారు నిజమేనా అంటూ రవితేజను సుమా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ ఆయన అలా ఎందుకు చెప్పారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు.. మాకు మాకు ఎన్నో అండర్ స్టాండింగ్స్ ఉంటాయి అంటూ రవితేజ తెలియజేశారు.

రెమ్యూనరేషన్ తీసుకోలేదా?

Advertisement

ఇలా ఈయన చెప్పిన సమాధానం బట్టి చూస్తుంటే రవితేజ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ లేకుండా నటించారని తెలుస్తోంది. ఒక్క సినిమాకు సుమారు 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న రవితేజ ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించడం అంటే మామూలు విషయం కాదు అయితే ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలోనే ఈయన ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా…

Advertisement

ఇలా రెమ్యూనరేషన్ లేకుండా రవితేజ ఈ సినిమాలో నటించారనే విషయం తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఈ సినిమాకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి బరిలో దిగుతున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. గతంలో ఈ సంక్రాంతి బరిలో మిరపకాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టారు. మరి మిరపకాయ్ తరహాలోనే సంక్రాంతి బరిలో అదే తేదీకి విడుదల కాబోతున్న భర్త  మహాశయులకు విజ్ఞప్తి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: BMW Film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆ డైరెక్టర్ బయోపిక్ సినిమానా…ఈ యాంగిల్ కూడా ఉందా!

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×