E-Paper
Advertisement

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి బహిష్కరణ..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి బహిష్కరణ..
Advertisement

Jani Master : టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ ఎదురైంది.. గత కొద్ది రోజులుగా డాన్సర్లకి అలాగే జానీ మాస్టర్ కి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.. తాజాగా జానీ మాస్టర్ కి అనుకొని షాక్ తగిలింది.. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తలు నిలవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.. ఆయనను బహిష్కరించడం పై ఇప్పటికే ఇండస్ట్రీలో పలు చర్చలు మొదలయ్యాయి.. కాస్త వివరాల్లోకి వెళితే..

జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. 

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఫెడరేషన్ దిమ్మతిరిగే షాకిచ్చింది.. గత కొన్ని రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈనెల 14న జరిగిన అంతర్గత విచారణకు హాజరుకావాలని ఫెడరేషన్ జానీ మాస్టర్‌ను ఆదేశించింది.. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ విచారణకు హాజరు కాకపోవడంతో పెద్దలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. దీంతో ఆయనను ఫెడరేషన్ నుంచి బహిష్కరించినట్లు తెలుస్తుంది..

మాస్టర్ పై కఠిన చర్యలు.. 

Advertisement

మాస్టర్ తీరు బాధ్యతరాహిత్యంగా ఉంది అని సినీ పెద్దలు మండిపడుతున్నారు. విచారణకు ఎందుకు హాజరు కాలేదు అన్నది మరో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. అంతేకాదు.. ఇండస్ట్రీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేశారు.. భవిష్యత్తులో ఆయన ఎటువంటి సినిమాలకైనా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన సరే ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని యూనియన్ స్పష్టం చేసింది. ఇకముందు ఫెడరేషన్ మరో నిర్ణయం తీసుకునే వరకి ఈ బహిష్కరణ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బహిష్కరణ న్యూస్ సోషల్ మీడియాలలో ను, అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

జానీ మాస్టర్ భార్యకు ఫెడరేషన్ హెచ్చరిక..

కేవలం జానీ మాస్టర్ కు మాత్రమే కాదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన పని పై తీవ్రంగా ఖండిస్తున్నారు. అసోసియేషన్‌కు సంబంధించిన జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించింది. అలాగే వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి , ఇండస్ట్రీలో డాన్సర్లుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా వ్యవహరించాలి అని హెచ్చరించారు. సొంత విషయాలు ఇక్కడ డాన్సర్లపై రుద్దితే ఊరుకునేది లేదు అని ఫెడరేషన్ పెద్దలు స్పష్టం చేశారు. మరో ఏడు రోజుల్లో జానీ మాస్టర్ ఏమని వివరణ ఇస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇప్పుడు మాస్టర్ చేస్తున్న సినిమాలను వదిలేస్తాడా? ఇకమీదట ఆయన కు కొత్త సినిమా అవకాశాలు వస్తాయా? లేదా? అన్నది చూడాలి..

Related News

చిన్న వయసులో గొప్ప సాయం.. నటి చేసిన పనికి ఫ్యాన్స్ కు షాక్..

ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. పోస్టర్ విడుదల చేసిన RAW NTR ఆర్గనైజేషన్!

ప్రియాంక చోప్రా బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ సర్ప్రైజ్ అదిరిపోయింది..

న్యాయం కావాలి.. ఫెడరేషన్ పై నిర్మాతలకు జానీ మాస్టర్ కంప్లైంట్!

బన్నీ క్యాంప్ నుంచీ మరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ వెనుక ఇంత కథ ఉందా?

క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై!

బన్నీ క్యాంప్ నుంచీ మరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

Advertisement
×