Geethu Royal : ఇండస్ట్రీలోని కొందరు ముద్దుగుమ్మల పేర్లు జనాలు అస్సలు మర్చిపోలేరు.. వాళ్లకున్న ప్రత్యేకతతో అందరి నోట్లో నానుతూనే ఉంటారు. ఒకవైపు విమర్శలు.. మరోవైపు ప్రశంసలు అందుకుంటున్న నటీనటులు ఎందరో జనాలకు అలా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో బిగ్ బాస్ గీతు రాయల్ ఒకరు.. తన ప్రత్యేకమైన యాసతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన గీతు ప్రస్తుతం నటి కూడా రాణిస్తుంది.. అయితే ఈమె తన భర్తతో విడాకులు తీసుకుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అవుతుంది.. గీతు రాయల్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ వార్త ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా, అలాగే యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్త్‌లో పుష్ప స్కిట్‌లో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు తెగ వినిపిస్తుంది. మొన్నటి వరకు తిరుమల వివాదంలో చిక్కుకున్న ఈ అమ్మడు దాని నుంచి బయటపడిందో లేదో ఇప్పుడు మరో వివాదం ఆమె మెడకు చుట్టుకుంది. భర్తతో విడిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న గీతు ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవుతుంది అంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే గీతు తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందా? లేదంటే ఇది కేవలం సోషల్ మీడియా పుకార్లు మాత్రమేనా? అసలు గీతు రాయల్ మనసులో ఏముంది అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే ఈ వార్తలకు గీతు రాయల్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది. కొన్ని నెలల క్రితం ఈమె తిరుమల కు వెళ్ళింది. అక్కడ బయట ఓ పాటకు తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ వేసింది.. తిరుమల లాంటి మహిమాన్విత గల ప్రదేశాల్లో ఆమె ఇలా చేయడం అవమానకరం అంటూ కొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉంది అన్నది ఇప్పటివరకైతే ఒక క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కొన్ని నెలల్లోనే ఇలా ఇంకో పెళ్లికి సిద్ధమవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమెపై వస్తున్న ఈ వార్తలపై గీతు ఎలా స్పందిస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. త్వరలోనే ఆమె దీనిపై రియాక్ట్ అయ్యే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..