E-Paper
Advertisement

విజయ్ చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో వైరల్.. ఆయనను మీరు గుర్తుపట్టారా?

విజయ్ చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో వైరల్.. ఆయనను మీరు గుర్తుపట్టారా?
Advertisement

Kollywood:సాధారణంగా ఒక సెలబ్రిటీకి సంబంధించి పుట్టినరోజు అయినా.. మరేదైనా అకేషన్ జరిగింది అంటే ఆ సెలబ్రిటీకి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తమిళనాడులో మొదటిసారి ఏకంగా 108 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించిన విజయ్ దళపతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలు తెలియనివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఆయన చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో. తాజాగా సోషల్ మీడియాలో ఆయన చిన్నప్పుడు తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఇందులో విజయ్ ఎక్కడున్నాడు? మీరు కూడా కనిపెట్టాలి? అంటూ ఈ ఫోటో ప్రజలను కూడా ఆకట్టుకోవడం గమనార్హం.

విజయ్ చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో వైరల్..

ఇకపోతే విజయ్ చిన్నవయసులో తన తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్న ఫోటోలో చక్కగా దువ్విన జుట్టుతో సాధారణ తెల్లటి యూనిఫామ్ ధరించి బుద్ధిమంతుడిగా కూర్చుని ఉండడం మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు విజయ్ చిన్ననాటి ఈ అరుదైన ఫోటోను చూసి అభిమానులు మురిసిపోతూ తెగ షేర్ చేస్తున్నారు. అప్పట్లోనే ఈ సూపర్ స్టార్ ఆకర్షణ చాలా స్పష్టంగా కనిపించిందని ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇకపోతే విజయ్ చెన్నైలోని కోడంబాక్కంలోని ఫాతిమా హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివి , ఆ తర్వాత బాల లోక్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్ కి మారారు. చివరికి లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీని పూర్తి చేశారు.

విజయ్ సినిమా కెరియర్..

Advertisement

ఇక 1974 జూన్ 22న మద్రాస్ లో జన్మించిన ఈయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సినీ దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్యగాయని.. కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా.. విజయ్ కి సోదరి ఉంది కానీ ఆమె చిన్న వయసులోనే మరణించింది. చిన్నతనంలోనే నటనపై ఆసక్తిని పెంచుకున్న విజయ్ వరుసగా తమిళ్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రాలతోనే కాదు తెలుగు చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ALSO READ:ఆ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించినవి కాదు – రవిబాబు క్లారిటీ!

విజయ్ వ్యక్తిగత జీవితం..

Advertisement

ఇక విజయ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. సంగీత సోర్నలింగం అనే అమ్మాయిని 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నారు ..వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్. 2000 సంవత్సరంలో లండన్ లో జన్మించగా కుమార్తె దివ్య షాష 2005 లో చెన్నైలో జన్మించింది .ఇకపోతే కుమారుడు జాసన్ సంజయ్ 2009లో విడుదలైన వెట్టైకారన్ అనే చిత్రంలో విజయ్ తో పాటు నటించాడు. ఇక కుమార్తె దివ్య 2016లో విడుదలైన తేదీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×