E-Paper
Advertisement

Divi Vadthya: పుష్ప 2 విషయంలో చెప్పిందొక్కటి.. చేసిందొక్కటి.. మొత్తం లేపేశారన్న దివి !

Divi Vadthya: పుష్ప 2 విషయంలో చెప్పిందొక్కటి.. చేసిందొక్కటి.. మొత్తం లేపేశారన్న దివి !
Advertisement

Divi Vadthya: దివివాద్య పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన దివికి సరైన సక్సెస్ మాత్రం పడలేదని చెప్పాలి వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ తనని తాను నిరూపించుకొనే ప్రయత్నాలలో ఉన్నారు. ఇలా పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటించిన ఈమె బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న దివి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పుష్ప 2 (Pushpa 2)సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

20 రోజుల షూటింగ్..10 రోజులు డబ్బింగ్..

పుష్ప 2 సినిమాలో ఈమె రిపోర్టర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈమె పాత్ర నిడివి తక్కువగానే ఉందని చెప్పాలి. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప2 సినిమాలో తన పాత్ర గురించి ఈమె మాట్లాడుతూ.. సినిమా స్టోరీ చెప్పే సమయంలో తనకు చెప్పింది ఒకటి, చేసింది మరొకటని తెలిపారు. ఈ సినిమా కోసం తాను దాదాపు 20 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నాను అదేవిధంగా పది రోజులపాటు డబ్బింగ్ కూడా తన పాత్రకు చెప్పానని దీవి తెలిపారు. ఇలా తన పాత్ర నిడివి ఎక్కువగానే ఉండటం వల్ల 20 రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నానని, కట్ చేస్తే ఎడిటింగ్ లోకి మొత్తం లేపేసారని దివి తెలిపారు.

టీజర్ మొత్తం నా పైనే..

Advertisement

ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నా పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంది. అలాగే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మొత్తం నా పాత్రతోనే ఉండటంతో నా పాత్ర ఇందులో అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను. కానీ సినిమా విడుదల అయ్యే సమయానికి అందులో నా పాత్ర మొత్తం ఎడిటింగ్ ల తీసేసారని సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డానని దివి తెలిపారు. సినిమా అద్భుతంగా ఉంటుందని నా ఫ్రెండ్స్ అందరితో కలిసి థియేటర్ కు వెళ్లాను థియేటర్లో నాకు సంబంధించి కేవలం రెండు మూడు సీన్లు మాత్రమే కనిపించడంతో ఫీలయ్యానని ఈమె తన బాధను మొత్తం బయటపెట్టారు.

దివి బాధలో అర్థం ఉందా..

Advertisement

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ లో చూపించిన సన్నివేశాలు కూడా సినిమాల్లో లేవని ఆవేదన చెందారు. ఇలా సినిమాలో తన పాత్రను తొలగించడం గురించి దివి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం. చాలామంది నటీనటులు సినిమా షూటింగ్లో పాల్గొని పూర్తి చేసినప్పటికీ ఎడిటింగ్ లో ఆ పాత్రలను మొత్తం తీసేస్తూ ఉంటారు. ఇలా ఎంతోమందికి చేదు అనుభవాలు మిగిలాయనే చెప్పాలి. ఇక పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలో తన పాత్రను తొలగించడం పట్ల దివి బాధపడటంలో అర్థం ఉంది అంటూ ఆమె అభిమానులు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Actor Sai Kiran: కొడుకు పేరును రివీల్ చేసిన నటుడు సాయి కిరణ్… బాలీవుడ్ హీరో పేరు పెట్టారుగా?

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×