Actor Sameer: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రత్యేకమైన క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో సమీర్ ఒకరు.. ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలతో బిజీగా లైఫ్ నీ లీడ్ చేసుకున్న సమీర్ ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కీలకపాత్రలో నటిస్తూ వస్తున్నాడు.. ఈమధ్య పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.. తన జీవితంలో జరిగిన ఎన్నో మార్పుల గురించి ఆ ఇంటర్వ్యూలలో బయట పెడుతూ అందరి మనసు దోచుకున్నాడు. అలాంటి సమీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంలో తన జీవితంలో పెద్ద పొరపాటు గురించి బయటపెట్టాడు.. అది కాస్త చర్చనీయాంశంగా మారింది..
సినీ నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెరపై, వెండితెరపై ఎన్నో సినిమాలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. ఈయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా మాట్లాడుతూ.. తాను జీవితంలో చేసిన మిస్టేక్ గురించి వివరించారు. అదేంటంటే.. ఓ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేదని బయటకు పంపించారు. అది తలుచుకొని అతను బాగా ఏడుస్తూ ఉంటే ఆ విషయం నాకు తెలిసి నేను అతనికి సాయం చేశాను.. అంతే కాదు అతనికి రావాల్సిన డబ్బులు గురించి కూడా నేను ప్రొడ్యూసర్స్ తో గొడవ పెట్టుకున్నాను.. దాంతో వాళ్లు నన్ను తీసేస్తామని అన్నారు. నేను చేసిన తప్పు ఏంటి అంటే కరెక్ట్ గా డబ్బులు అడగడమే అని సమీర్ అన్నారు. ఆ తర్వాత ఆ సీరియల్ పెద్దగా ఆడలేదని కూడా చెప్పారు. నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను అవి కొన్నిసార్లు నాకే రిస్క్ అవుతాయని సమీర్ అంటున్నారు.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి సమీర్ కలిసిన నటించిన సినిమాలలో జై చిరంజీవ ఒకటి. ఈ మూవీ షూటింగ్ టైంలో ఉన్నప్పుడు సమీర్ అయ్యప్ప మాల వేసుకున్నాడని ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ మాల వేసుకున్న తర్వాత పూజ ఉండడంతో షూటింగ్ ఒక రోజంతా ఆపేసారని చెప్పారు. ఆ తర్వాత రోజు డేట్స్ మారాయి మీరు షూటింగ్ కి రావాలని డైరెక్టర్ చెప్పడంతో నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని సమీర్ అన్నారు. నా సీన్ కోసం చిరంజీవి లాంటి పెద్ద వాళ్ళని వెయిట్ చేయించమే ఆయన నన్ను ఏమంటారో అని భయపడ్డాను. ఒకరోజు నన్ను క్యారావాన్ లోకి రమ్మని పిలిచారు. నువ్వు సమీర్ అని ముస్లిం పేరు పెట్టుకున్నావు. మరి అయ్యప్ప మాల ఎలా వేస్తావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం విని ఆయన నవ్వారు. నేనింకేమైనా తిడతారేమో అనుకొని భయపడ్డాను కానీ ఆయన అలా మాట్లాడటంతో నేను చాలా ఫ్రీ అయ్యానని సమీర్ అన్నారు.. ఇంటర్వ్యూ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక సమీర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు..