E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా పెళ్లి.. సీరియల్స్ చేస్తుందా..?

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా పెళ్లి.. సీరియల్స్ చేస్తుందా..?
Advertisement

Gundeninda Gudigantalu Meena : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు. డిఫరెంట్ స్టోరీ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తున్న ఈ సీరియల్ లో నటీనటులు ఎవరికి వారే అన్నట్లు జీవించేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నటించిన అమూల్య గౌడ గురించి చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి ఈమె తెలుగమ్మాయి కాదు. కానీ ఎంతో చక్కగా తెలుగమ్మాయిలాగా పద్ధతిగా ఉంటుంది. ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. ఈమెకు తెలుగులో ఇది రెండో సీరియల్.. గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో జనాలకు బాగా దగ్గరైంది. ఈమె గురించి చాలా మందికి తెలిసి ఉండదు.. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్.. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటుందా? లేదా అన్నది ఒకసారి తెలుసుకుందాం..

అమూల్య – నిరంజన్ పెళ్లి ఫిక్స్..? 

ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ హీరో నిరంజన్, అమూల్య గౌడ డేటింగ్ లో ఉన్నారన్న విషయం చాలామందికి తెలిసిందే ఉంటుంది. వీరిద్దరూ కలిసి పలు స్పెషల్ షోలకు రావడంతో పాటుగా సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంటారు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో వీరి పెళ్లి అయిపోయింది అంటూ ఓ వార్త కూడా వినిపించింది.. ఈ పెళ్లి వార్తలు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈమధ్య గ్యాప్ లేకుండా ఇద్దరు వెకేషన్ లకు తెగతిరిగేస్తున్నారు. తాజాగా వీరిద్దరి వీడియో కూడా వైరల్ అవ్వడంతో.. ఈ నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే గత ఏడాది పెళ్లి జరగాల్సింది. కొన్ని కారణాలతో వాయిదా పడిందట. మరి ఈ ఏడాది చివరిలో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే వీరిద్దరూ రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

గుండెనిండా గుడిగంటలు..

Advertisement

స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో కొనసాగుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడిగంటలు ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలో డబ్బుకున్న విలువ గురించి, డబ్బున్న మనుషులకు ఇచ్చే విలువ గురించి చక్కగా చూపించారు.. ఇందులో మధ్యతరగతి అమ్మాయి మీనా పాత్రలో అమూల్య అమూల్య నటించింది.. నాచురల్ లుక్ లో తన అమాయకపు నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఈ సీరియల్ లో నటించేందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో అమూల్య ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.. ఈమెకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×