E-Paper
Advertisement

Chinmayi Sripaada: అనసూయకు’చీర ఛాలెంజ్‌ ‘ .. బీజేపీ మహిళా నేతకు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్!

Chinmayi Sripaada: అనసూయకు’చీర ఛాలెంజ్‌ ‘ .. బీజేపీ మహిళా నేతకు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Chinmayi Sripaada:  టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళల గురించి ఎవరైనా కామెంట్లు చేస్తే తనదైన శైలిలోనే సమాధానాలు చెబుతూ వివాదాలలో నిలుస్తుంటారు. ఇటీవల శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలపై చిన్మయి కూడా ఘాటుగా స్పందించారు. ఇక ఈ వివాదంలో అనసూయ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అనసూయ, చిన్మయి పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరు తమదైన శైలిలోనే కౌంటర్లు ఇస్తున్నారు.

ప్రతి ఒక్కరూ చీర పంపించండి..

తాజాగా బిజెపి మహిళ నేత ప్రభ గౌడ (Prabha Gowda)అనసూయ(Anasuya)కు చీర ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనసూయ వస్తదరణ విషయంలో చాలామంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో అనసూయ కంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో సంస్కారవంతంగా ఉన్నారు. వారిని చూసి అనసూయ నేర్చుకోవాలని ప్రభా గౌడ తెలిపారు. ఎవరైతే అనసూయ కూడా చాలా పద్ధతిగా చీర కట్టుకొని ఉండాలి అనుకుంటారో వారందరూ కూడా నాలాగా తనకు ఒక చీరను పంపించండని ఈమె అనసూయకు చీర ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహిళలను వేధించడానికి..

Advertisement

ఈ వీడియో పట్ల ఎంతోమంది స్పందిస్తూ మీరు చెప్పింది కరెక్టే అంటూ మహిళ నేతకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సింగర్ చిన్మయి (Chinmayi)ఈ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రభా గౌడకు సంబంధించిన ఈ పోస్టును చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. బీజేపీ  మహిళా నాయకురాలు అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయకు చీర పంపించి సరిగ్గా దుస్తులు ధరించడం నేర్పించండి అంటూ ప్రజలకు ఒక ఛాలెంజ్ చేస్తుంది. బట్టలు కోసం స్త్రీలను ఏమాత్రం సిగ్గు పడకూడదనే అభిప్రాయం కోసం ఒక మహిళ ఇతర మహిళలను వేధించడంలో ఇలాంటి ఆలోచన కలిగే ఉంటుందని తాను అస్సలు అనుకోలేదు. ఈ ప్రపంచంలో ప్రతి చోట రాజకీయ నాయకులకు స్త్రీలను వేధించడానికి ఇంత సమయం ఉంటుందా అంటూ చిన్మయి మహిళా నేతకు కౌంటర్ ఇస్తూ ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

చిన్మయి చేసిన ఈ పోస్టుపై ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మరి అనసూయకు చీర ఛాలెంజ్ విషయంపై అనసూయ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. శివాజీ ఒక సినిమా వేడుకలో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ వివాదంగా మారుతూనే ఉన్నాయి శివాజీ విషయంలో క్షమాపణలు చెప్పి సైలెంట్ అయిన ఈ వివాదంపై పెద్ద ఎత్తున రాజకీయ నాయకురాళ్లు మహిళా సంఘాల నేతలు కూడా స్పందించడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Also Read: Nagavamsi: ఆ రెండు రాత్రులు నిద్రలేదు… వారికి రిటర్న్ గిఫ్ట్స్ రెడీ చేసిన నాగవంశీ!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×