E-Paper
Advertisement

Mouth Bacteria: నోటి శుభ్రత లేకుంటే కాలేయానికి ప్రమాదమే ! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

Mouth Bacteria: నోటి శుభ్రత లేకుంటే కాలేయానికి ప్రమాదమే ! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు
Advertisement

Mouth Bacteria: నోటిలోని బ్యాక్టీరియా ద్వారా కాలేయ వ్యాధుల ముప్పును ముందే గుర్తించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. జర్మనీలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం.. నోటి ఆరోగ్యానికి ,కాలేయానికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రఖ్యాత ‘నేచర్ మైక్రోబయాలజీ’ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.

ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా ‘అడ్వాన్స్‌డ్ క్రానిక్ లివర్ డిసీజ్’ కారణంగా మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త అధ్యయనం కాలేయ వ్యాధుల ముందస్తు గుర్తింపులో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

Advertisement

అధ్యయనం ఏం చెబుతోంది ?
పరిశోధకులు 86 మంది రోగుల లాలాజలం, మల నమూనాలను విశ్లేషించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో నోటిలో ఉండే బ్యాక్టీరియా, పేగులలో ఉండే బ్యాక్టీరియా వేర్వేరుగా ఉంటాయి. కానీ.. కాలేయ వ్యాధి ముదురుతున్న కొద్దీ ఈ రెండు చోట్లా ఉండే బ్యాక్టీరియా జనాభాలో గణనీయమైన మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు.

ముఖ్యంగా.. కాలేయ వ్యాధి ఉన్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా పేగులలోకి ప్రయాణించి అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ, నోరు ,ప్రేగులలోని మైక్రోబయోమ్ దాదాపు ఒకేలా మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.

Advertisement

కొల్లాజెన్ విచ్ఛిన్నం – కాలేయానికి ముప్పు:
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన, షాకింగ్ విషయం ఏమిటంటే.. నోటి నుంచి పేగుల్లోకి చేరిన బ్యాక్టీరియా ‘కొల్లాజెన్’ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను విడుదల చేస్తున్నాయి. కొల్లాజెన్ అనేది మన పేగుల గోడలను బలంగా ఉంచే ఒక ప్రోటీన్.

ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తాయో.. అప్పుడు పేగుల గోడలు బలహీనపడతాయి. దీని వల్ల పేగుల్లో ఉండాల్సిన ప్రమాదకర బ్యాక్టీరియా, ఇతర విషపూరిత పదార్థాలు రక్తంలోకి చేరి, నేరుగా కాలేయానికి చేరుకుంటాయి. ఇది కాలేయ వ్యాధిని మరింత తీవ్రం చేస్తుంది.

ముందస్తు గుర్తింపు సాధ్యమేనా ?
కాలేయ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకోకముందే… నోటి మైక్రోబయోమ్‌లో వచ్చే మార్పులను పసిగట్టవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అంటే.. ఒక వ్యక్తి కాలేయం ఎంతవరకు దెబ్బతిన్నదో లేదా భవిష్యత్తులో కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఉందో వారి లాలాజల పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

కొత్త చికిత్సా మార్గాలు:
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో కొత్త చికిత్సలకు దారి చూపనుంది.

పేగుల గోడలను రక్షించడం: పేగుల గోడలు దెబ్బతినకుండా జాగ్రత్త పడటం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.

నోటి ఆరోగ్యం: నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించడం ద్వారా కాలేయానికి చేరే ముప్పును అడ్డుకోవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×