E-Paper
Advertisement

మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!

మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!
Advertisement

Lavanya Tripathi: సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకి అవకాశాలు ఎప్పుడూ తక్కువే అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. అంతేకాదు కొంతమంది పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అవకాశాలు అందుకుంటుంటే.. మరి కొంతమందికే అదృష్టం కలిసి రాకో లేక వారిని దర్శకులు గుర్తించడంలో విఫలమవుతున్నారో తెలియదు కానీ అందం, అభినయం, ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ భరించలేక ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వారి శరీరంలో వచ్చే మార్పుల కారణంగా వాళ్ళు బరువు పెరిగినా లేదా బక్క చిక్కిపోయినా బాడీ షేమింగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

లావణ్య పై బాడీ షేమింగ్ ట్రోల్స్..

ఈ నేపథ్యంలోనే మెగా కోడలిపై విపరీతమైన బాడీ షేమింగ్ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు? అసలేమైంది? అనే విషయానికి వస్తే.. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఒకప్పుడు అందంగా, సొట్టబుగ్గల తో అందరినీ ఆకట్టుకున్న లావణ్య వివాహం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత కచ్చితంగా ఏ మహిళ శరీరంలో అయినా సరే మార్పులు రావడం సహజమే. అలా లావణ్యలో కూడా కాస్త మార్పులు రావడం.. ఆమె బొద్దుగా మారడంతో ఇప్పుడు ఆమెపై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం.

Advertisement

also read:నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

బొద్దుగా కనిపించడంతో ఆంటీ అంటూ..

విషయంలోకి వెళ్తే.. లావణ్య ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో కొంత బరువు పెరిగి కనిపించడంతో సోషల్ మీడియాలో కొంతమంది ఆమె శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఒక తల్లి అని కూడా చూడకుండా ఆమె శరీరాకృతిని విమర్శిస్తూ.. ఆంటీలా ఉందంటూ బాడీ షేమింగ్ కి దిగారు. దీంతో రంగంలోకి దిగిన మెగా అభిమానులు ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోవడానికి తగినంత సమయం పడుతుంది.. అలాంటప్పుడు ఆమె శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాల్సింది పోయి ఇలా బహిరంగంగా హేళన చేస్తారా? అంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు.

ఇప్పటికైనా మార్పు వస్తుందా?

Advertisement

జెన్ జీ జనరేషన్లో కూడా ఇంకా కొంతమంది ఆకతాయిలు అమ్మాయిల పరిస్థితులను, వారి శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించకుండా ఇలా సంకుచిత బాడీ షేమింగ్ చేసే సంస్కృతికి వెంటనే స్వస్తి పలకాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కొంతమంది లావణ్య త్రిపాఠి బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తుంటే మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ కొంతమంది ఆకతాయిలలో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.

కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమైన లావణ్య..

లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. ఆ అబ్బాయికి వాయువ్ తేజ్ అని నామకరణం కూడా చేశారు. ఇకపోతే సతీ లీలావతి సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించిన ఈమె.. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలకు సమయాన్ని కేటాయించి సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

Big Stories

Advertisement
×