Bank Data Leak: సైబర్ నేరగాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థపై కన్నేశారా? కనీసం వారం లేదా రెండు వారాలకు ఒకసారి డేటా లీక్ వ్యవహారం కంపెనీలను కంగారు పెడుతుందా? మొన్నటికి మొన్న ఆటో ఇండస్ట్రీ కాగా, ఇప్పుడ బ్యాంక్ వంతైంది. తాజాగా బ్యాంక్ ఆప్ బరోడా నుంచి ఒక టీబీ డేటా లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది?
షాకింగ్ ఘటన-దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆ బ్యాంకుపై సైబర్ దాడి జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బ్యాంక్ వ్యవస్థలోకి సైబర్ నేరగాళ్లు చొరబడి దాదాపు 1 టీబీ డేటాను చోరీ చేసినట్టు ఓ హ్యాకర్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన వివరాలు డార్క్‌వెబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపాడు.
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన TB డేటా లీక్? బ్యాంకు ఖాతాదారుల ఆధార్ నెంబర్లు, వారి పేర్లు, రుణాల వివరాలు, సేవింగ్స్, కరెంట్ ఖాతాల సమాచారం, ఎన్‌ఆర్‌ఐ, కార్పొరేట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయని చెబుతున్నాడు. డేటా లీక్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో బయటపెట్టాడు. వీటిని పరిశీలించిన సైబర్ నిపుణులు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్- క్యాష్‌లెస్ కన్జ్యూమర్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ పేరు ఉన్నాయి.
డార్క్‌వెబ్‌లో డేటా ప్రత్యక్షం- వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. వాటిని పరిశీలించిన నిపుణులు బ్యాంక్‌కు చెందిన పత్రాలుగా చెబుతున్నారు. బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, లోన్ డాక్యుమెంట్లు, దర్యాప్తు వివరాలు, ఖాతాదారుల దరఖాస్తుల వంటి పత్రాలు ఉన్నాయని వెల్లడించాడు.
నోరు మెదపని బ్యాంక్ ఆఫ్ బరోడా- వస్తున్న వార్తలపై ఇటు బ్యాంక్ ఆఫ్ బరోడా, అటు ఆర్బీఐ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. తాను ఒక TB డేటాను అందుబాటులోకి తెచ్చినట్లు హ్యాకర్ ప్రస్తావించాడు. దీనికి సంబంధించి ఏ హ్యాకర్ బహిరంగంగా బాధ్యత వహించలేదు. ట్రిపుల్ఎక్స్ అనే కొత్త హ్యాకింగ్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉండవచ్చని శ్రీకాంత్ అనే భావిస్తున్నాడు.
ట్రిపుల్‌ఎక్స్ పనేనని అనుమానం? గతేడాది మే నెలలో ట్రిపుల్‌ఎక్స్.. ఇండోనేషియాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పీటీ బ్యాంక్ నెగారా ఇండోనేషియాలోకి చొరబడింది. ఒప్పందాలు, వ్యక్తిగత గుర్తింపు వివరాలు, ఆర్థిక లావాదేవీలు, అంతర్గత బ్యాంకింగ్ పత్రాలతో సహా సుమారు 2TB డేటాను దొంగిలించిన విషయం తెల్సిందే. బ్యాంకింగ్ రంగంలో సైబర్ సెక్యూరిటీ భయం పెరుగుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది.
ALSO READ: 1 TB డేటా లీక్.. ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు షాక్, డార్క్‌వెబ్‌లో డేటా ప్రత్యక్షం
క్లాడ్ మిథోస్ వంటి ఏఐ నమూనాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.. బ్యాంకర్లు సమావేశంలో డేటా కోసం సరైన భద్రతా చర్యలు అమలు చేయాలని కోరిన విషయం తెల్సిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా అంతర్గత వ్యవస్థలో ఇటీవల ఎలాంటి డేటా ఉల్లంఘన జరగలేదని తెలుస్తోంది.
గత సెప్టెంబర్‌లో ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ డేటా బేస్‌లో 2,73,000 మంది భారతీయ బ్యాంకింగ్ రికార్డులు ఉన్నాయని పేర్కొంది. అందులో 6 వేల రికార్డులు బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినవి. అయితే ఇది ఓ థర్డ్ పార్టీ సిస్టమ్ అని తేలింది. మొత్తానికి తాాజా వార్తలపై బ్యాంక్ ఆఫ్ బరోడా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.