E-Paper
Advertisement

Hrithik Roshan: చేతి కర్రల సాయంతో స్టార్ హీరో… టెన్షన్ లో ఫాన్స్..ఏం జరిగిందంటూ?

Hrithik Roshan: చేతి కర్రల సాయంతో స్టార్ హీరో… టెన్షన్ లో ఫాన్స్..ఏం జరిగిందంటూ?
Advertisement

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ ఇటీవల ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా హృతిక్ రోషన్ షాకింగ్ లుక్ లో కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు హృతిక్ రోషన్ కు ఏమైంది? ఎందుకు ఆయన చేతి కర్రల సహాయంతో నడుస్తున్నారు? ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. హృతిక్ రోషన్ ఇటీవల ముంబైలో డైరెక్టర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని సందడి చేశారు.

ప్రమాదానికి గురైన హృతిక్ రోషన్?

ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా హృతిక్ రోషన్ చేతి కర్ర సహాయంతో కనిపించడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ఫోటోలు దిగడానికి కూడా పూర్తిగా నిరాకరించడంతో ఈయన ఆరోగ్యం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది మార్చి నెలలో ఈయన ప్రమాదానికి గురి కావడంతో తన కాలికి గాయం అయిందనే విషయాన్ని స్వయంగా తెలియజేశారు ఇప్పుడు చేతి కర్ర సహాయంతో నడవడంతో మరోసారి ఈయనకు ఏం జరిగింది అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి హృతిక్ రోషన్ కు ఏం జరిగిందనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా హృతిక్ రోషన్ త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

క్రిష్ 4 పనులలో హృతిక్ రోషన్..

Advertisement

ఇక హృతిక్ రోషన్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన క్రిష్ 4 పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు స్వయంగా క్రిష్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన చివరిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి వార్ 2 (WAR 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదల అయింది అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

నిరాశపరిచిన వార్ 2..

Advertisement

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) కూడా నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కు బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల అంచనాలను మాత్రం సినిమా చేరుకోలేకపోయింది. ఈ సినిమా అనంతరం హృతిక్ రోషన్ క్రిష్ 4 సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Big Tv Kissik Talks: సినిమా టికెట్ల రేట్ల పై దివి కామెంట్స్.. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×