E-Paper
Advertisement

Vishnu vinayasam : ‘విష్ణు విన్యాసం ‘ నుంచి సాంగ్ వచ్చేసింది.. పెళ్లంటే కష్టమంటున్న హీరో..

Vishnu vinayasam : ‘విష్ణు విన్యాసం ‘ నుంచి సాంగ్ వచ్చేసింది.. పెళ్లంటే కష్టమంటున్న హీరో..

Vishnu vinayasam : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హిట్లను కొడుతున్నాడు.. ఒకప్పుడు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి ఒక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈమధ్య ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా విష్ణు విన్యాసం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలోకి రాబోతుంది. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో సినిమా నుంచి వరుసగా అప్డేట్లను వదులుతున్నారు.. ఈ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ పాట ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

పెళ్లి కష్టమే అంటున్న విష్ణు..

శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో బజ్ పెంచుతోంది.. యంగ్ డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటని మేకర్స్ రిలీజ్ చేశారు.. బ్రేకప్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఏమి రా బాల రాజా.. ఎందుకీ మడత కాజా.. ప్రేమంటే కష్టమే పెళ్లంటే ముల్లె అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం యువతని బాగా ఆకట్టుకుంటుంది. ఈ లిరికల్ సాంగ్ వీడియో కొద్ది క్షణాల క్రితమే రిలీజ్ అయింది. మొత్తానికి ఈ సాంగ్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read :ఇండస్ట్రీ పై మహేష్ విట్టా కామెంట్స్..దయచేసి ఎవరు ఆ తప్పు చెయ్యొద్దు..

డిఫరెంట్ స్టోరీతో ‘విష్ణు విన్యాసం ‘..

హీరో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ తో యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని, వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈ హీరో ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 27న థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరును పెంచింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచితే.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ మంచి బస్ ను క్రియేట్ చేసింది. యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. సినిమాపై అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. మరి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×