E-Paper
Advertisement

Mahesh Vitta : ఇండస్ట్రీ పై మహేష్ విట్టా కామెంట్స్..దయచేసి ఎవరు ఆ తప్పు చెయ్యొద్దు..

Mahesh Vitta : ఇండస్ట్రీ పై మహేష్ విట్టా కామెంట్స్..దయచేసి ఎవరు ఆ తప్పు చెయ్యొద్దు..
Advertisement

Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు స్టార్ హీరోల సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ.. తన కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఈయన చేసిన సినిమాలు అన్నీ కూడా అతనికి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి. అయితే ఈ మధ్య మహేష్ విట్టా పెద్దగా సినిమాలలో కనిపించలేదు. గతంలో వరుసగా సినిమాలలో కనిపించిన ఈయన ఈమధ్య ఆడపా తడప సినిమాలలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇకపోతే మహేష్ ఈమధ్య యూట్యూబ్ చానల్స్ కి ఎక్కువగా ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నాడు.. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని అనుకునే వాళ్ళకి మహేష్ విట్టా ఇచ్చిన సూచనలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. ఇంతకీ ఆయన ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను.. 

ఫన్ బకెట్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్లలో మహేష్ విట్టా ఒకరు. తన స్లాంగ్ తో కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ షేర్ చేసుకున్నారు. అలాంటి కమెడియన్డి యన్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు మహేష్ విట్టా ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి బాగోతాల గురించి బయట పెట్టాడు.. తాజాగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ ఏమి ఇవ్వదు. మనము ఏం తెచ్చుకున్న సరే దాన్ని కొన్ని రోజులు కూడా ఉంచకుండా పోగొట్టేస్తుంది అని భయంకర నిజాన్ని బయట పెట్టాడు.. నేను ఇండస్ట్రీకి వచ్చే తప్పు చేశాను అని చాలాసార్లు అనిపించింది అని మహేష్ అన్నారు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకి ఇంతవరకు సొంత ఇల్లు కూడా లేదు అని ఎమోషనల్ స్టోరీ ని పంచుకున్నారు. ఇప్పుడు మహేష్ ఇండస్ట్రీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారింది..

Advertisement

Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రదీప్.. ఇండస్ట్రీ అమ్మాయి మాత్రం కాదట..!

ఇండస్ట్రీకి రావాలంటే డబ్బులు ఉండాలా..? 

అయితే ఈ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి రావాలని అనుకునే వారికి మీ సలహాలు సూచనలు ఏమిస్తారు అని యాంకర్ అడుగుతారు.. ఆ మాట వినగానే మహేష్ మీకు అలాంటి కోరికలు ఏవైనా ఉంటే పక్కన పెట్టేసుకోండి అని అంటాడు. ఒకవేళ మీకు ఇండస్ట్రీకి తప్పకుండా రావాలి అని అనిపిస్తే మాత్రం మీకు ఆస్తులు బాగా ఉంటేనే ఇండస్ట్రీకి రండి. లేదంటే అసలు ఆ ఆలోచన కూడా మీకు రావద్దు అని మహేష్ ఒక్క మాటతో షాకిచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా నేనేమి సంపాదించాను కనీసం సొంత ఇల్లు కూడా లేదు అని మహేష్ అన్నాడు. మనము సంపాదించి ఇంట్లో ఇవ్వాలి అని ఆలోచన మాత్రం అస్సలు రానివ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఊడతాయో చెప్పడం కష్టమని అన్నాడు.. ముఖ్యంగా ఇండస్ట్రీలోని వాళ్ళు ఫ్రెండ్స్ ఉండకపోవడమే మంచిది అని సలహా ఇచ్చాడు.. మొత్తానికి అతని ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు స్పందించి మహేష్ విట్టాకు మంచి అవకాశాలు ఇస్తారా? లేదంటే ఆయన మాటలతో ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో చూడాలి..

Advertisement

 

Related News

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

Big Stories

Advertisement
×