E-Paper
Advertisement

Bucchi Babu: రైరైరారా డ్యాన్స్ ఇరగదీసిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన బుచ్చి..సినిమా ఛాన్స్ వచ్చినట్టేనా?

Bucchi Babu: రైరైరారా డ్యాన్స్ ఇరగదీసిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన బుచ్చి..సినిమా ఛాన్స్ వచ్చినట్టేనా?
Advertisement

Bucchi Babu: బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా ఈ రెండు పాటలకు అద్భుతమైన ఆదరణ లభించింది. ఇటీవల విడుదల చేసిన సెకండ్ సింగిల్ రై రై రారా అంటూ సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

వీడియో కాల్ చేసి అభినందించిన బుచ్చిబాబు..

ఈ పాటకు ఎంతోమంది రీల్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఒక స్కూల్ చిన్నారి ఈ పాటకు అద్భుతమైన డాన్స్ ఇరగదీసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కాస్త డైరెక్టర్ బుచ్చిబాబు దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ఆ చిన్నారికి వీడియో కాల్ చేసి మరి అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇచ్చాపురానికి చెందిన ఈ చిన్నారి పేరు శివాని(Shivani) అని తెలుస్తుంది. ఈ చిన్నారి ఆరో తరగతి చదువుతున్నారట.

చిన్నారి డాన్స్ కు బుచ్చిబాబు ఫిదా..

Advertisement

తన తండ్రికి డాన్స్ అంటే ఎంతో ఇష్టం కావడంతో తన కుమార్తెకు స్వయంగా ఆయనే ఈ డాన్స్ నేర్పినట్లు తెలియజేశారు. ఇక చిన్నారి డాన్స్ చాలా అద్భుతంగా చేసింది అంటూ బుచ్చిబాబు చిన్నారిపై ప్రశంసలు కురిపించారు అలాగే హైదరాబాద్ వస్తే ఒకసారి నాకు ఫోన్ చేయండి కలుస్తాను అంటూ బుచ్చిబాబు తెలిపారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలవండి అని చెప్పడంతో బహుశా చిన్నారికి సినిమాలలో అవకాశాలు కల్పిస్తారా అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలా బుచ్చిబాబు చిన్నారిని ప్రశంసిస్తూ చాలా అద్భుతంగా డాన్స్ చేశావు. బాగా చదువుకో తల్లి అంటూ చెప్పడంతో ఆ చిన్నారి బుచ్చిబాబుతో మాట్లాడుతూ నాకు ఒకసారి రామ్ చరణ్ గారితో మాట్లాడాలని ఉంది సర్.. రామ్ చరణ్ గారితో మాట్లాడించండి అంటూ అడిగారు. ఇలా చిన్నారి అడగడంతో వెంటనే బుచ్చిబాబు నేను చరణ్ గారితో మాట్లాడి కచ్చితంగా నీకు హాయ్ చెప్పిస్తాను అంటూ మాట ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిన్నారి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సినిమాలలో అవకాశాలను అందుకుంటూ సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్నారి ఎనర్జీ చూస్తుంటే ఈమె కూడా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుందనే చెప్పాలి.

Also Read: Ustaad Bhagat Singh OTT: పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..ఎప్పుడంటే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×