E-Paper
Advertisement

kollywood: కోలీవుడ్‌కు టాలీవుడ్ షాక్: తమిళ తంబీల ‘డబ్బింగ్’ పప్పులు ఇక ఉడకవా ?

kollywood: కోలీవుడ్‌కు టాలీవుడ్ షాక్: తమిళ తంబీల ‘డబ్బింగ్’ పప్పులు ఇక ఉడకవా ?
Advertisement

kollywood: ఒకప్పుడు తమిళ హీరోల సినిమా వస్తుందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ హడావుడి ఉండేది. డబ్బింగ్ సినిమాలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. వసూళ్లతో మన స్ట్రైట్ సినిమాలకే చెమటలు పట్టించేవారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది.. కాలం మారింది.. ప్రేక్షకుల టేస్ట్ మారింది. అన్నిటికీ మించి ‘డబ్బింగ్’ అనే ముద్ర పడితే చాలు, థియేటర్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా మనోళ్లు ఇష్టపడటం లేదు. తమిళనాట బ్లాక్ బస్టర్లు అని డబ్బా కొట్టుకుంటున్న సినిమాలు కూడా ఇక్కడ ‘డిజాస్టర్’ బోర్డులు తిప్పేస్తున్నాయి.

కంటెంట్ లేకపోతే ‘కట్’ చెప్పేస్తున్న ఆడియన్స్
తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు చాలా ‘డేంజర్’ అయిపోయారు. కథలో దమ్ముంటేనే థియేటర్ మెట్లు ఎక్కుతున్నారు. “అక్కడ హిట్ అయితే మాకేంటి? ఎలాగూ నెల రోజుల్లో ఓటిటిలోకి వస్తుంది కదా.. అప్పుడే చూసుకుందాం” అనే ధోరణి పెరిగిపోయింది. తమిళంలో వచ్చే రొటీన్ మాస్ మసాలా, అతిగా ఉండే సెంటిమెంట్ డ్రామాలను మనవాళ్లు రిజెక్ట్ చేస్తున్నారు. కంటెంట్ వీక్ గా ఉంటే అది ఏ స్టార్ సినిమా అయినా సరే.. కనీసం పోస్టర్ల ఖర్చులు కూడా రావడం లేదు.

Advertisement

‘విత్ లవ్’.. థియేటర్లో నో లవ్, ఓటిటిలో మాత్రం ఫుల్ వ్యూస్
ఇటీవల తమిళంలో రొమాంటిక్ కామెడీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన “విత్ లవ్” సినిమానే దీనికి నిదర్శనం. తమిళ తంబీలు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు కానీ.. తెలుగులో రిలీజ్ చేస్తే కనీసం డిస్ట్రిబ్యూటర్ల అద్దెలు కూడా రాలేదు. అదే సినిమా ఓటిటిలోకి రాగానే అందరూ ఎగబడి చూశారు. అంటే, డబ్బింగ్ సినిమాలకు ‘థియేటర్ల’ కాలం చెల్లిపోయిందన్నమాట! అటు సీనియర్ నటి రాధిక ప్రధాన పాత్రలో వచ్చిన “తాయ్ కిళవి” తమిళంలో విమర్శకుల ప్రశంసలు పొందింది. కానీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం “బాబోయ్.. ఈ సినిమా మాకొద్దు” అని చేతులెత్తేశారు.

300 కోట్ల హీరో శివకార్తికేయన్‌కూ తప్పని తిప్పలు
ఇక తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన లేటెస్ట్ మూవీ “వా వాతియార్” ను తెలుగులో “అన్నగారు వస్తారు” అని ఆర్భాటంగా అనౌన్స్ చేశారు. కానీ తమిళంలో ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ రావడంతో.. “అన్నగారు రావడం లేదు.. ప్యాకప్ చెప్పేయండి” అంటూ నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. చివరికి 300 కోట్ల క్లబ్ హీరో శివకార్తికేయన్‌కూ ఇక్కడ తిప్పలు తప్పడం లేదు. “అమరన్” సినిమాతో భారీ వసూళ్లు రాబట్టిన ఆయన.. ఆ తర్వాత నటించిన భారీ పీరియాడిక్ పొలిటికల్ డ్రామా “పరాశక్తి” విషయంలో టాలీవుడ్ ముఖం చాటేసింది.అసలు ఈ సినిమాను తెలుగు థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం ఎవరూ చేయలేదు కూడా. స్టార్ ఇమేజ్ ఉన్నా సరే.. కంటెంట్ కనెక్ట్ అవ్వదని భావిస్తే తెలుగు మార్కెట్ లో అస్సలు ఛాన్స్ దొరకడం లేదు మరి.

Advertisement

ప్యాకప్ చెప్పాల్సిన టైం వచ్చేసిందా …
తమిళ నిర్మాతలు ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలి. కేవలం అక్కడ హిట్ అయిందనో, స్టార్ హీరో ఉన్నాడనో తెలుగులో సినిమాలు రిలీజ్ చేస్తే పప్పులు ఉడకవు. కథలో తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉండాలి. కనీసం ప్రమోషన్లు కూడా చేయకుండా డైరెక్ట్ గా థియేటర్లలో వదిలేస్తే జనం లైట్ తీసుకుంటున్నారు.
మొత్తానికి చూస్తే.. తమిళ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ గడ్డపై బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మార్కెట్ లో నిలబడాలంటే ‘కంటెంట్’ లో కసి ఉండాలి.. లేదంటే మాత్రం ఓటిటికే పరిమితం అవ్వకతప్పదు!
read also: ఆస్కార్ విజేతకు మణి ‘షాక్’.. అసలు కారణం ఇదేనా!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×