E-Paper
Advertisement

Chai Wala: ‘చాయ్ వాలా’ ఫిబ్రవరి 6న రావడం లేదు.. ఎందుకంటే?

Chai Wala: ‘చాయ్ వాలా’ ఫిబ్రవరి 6న రావడం లేదు.. ఎందుకంటే?
Advertisement

Chai Wala: శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’ (Chai Wala). రాజీవ్ కనకాల (Rajeev Kanakala), తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష (Pramod Harsha) ఈ మూవీకి దర్శకత్వం వహించగా, వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.

Also Read- Rajendra Prasad: పద్మశ్రీ రావడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు

‘చాయ్ వాలా’ వాయిదా ఎందుకంటే..

Advertisement

హర్షిక ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే.. ‘‘ముందస్తుగా ఊహించని కొన్ని అనివార్య కారణాల వల్ల, మా రాబోయే చిత్రం ‘చాయ్‌ వాలా’ (CHAI WALA) విడుదల తేదీని మారుస్తున్నామని మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు హర్షిక ప్రొడక్షన్స్ తెలియజేస్తోంది. మొదట ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. మీరు మాపై చూపిస్తున్న నిరంతర మద్దతు, అవగాహనకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కొత్త తేదీన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని టీమ్ హర్షిక ప్రొడక్షన్స్ పేర్కొంది.

Also Read- Attitude Star: నువ్వు పాడింది భగవద్గీత కాదు.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలా? బెదిరిస్తున్నావా?

ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌

Advertisement

ఇక సినిమా గురించి ఇటీవల హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘చాయ్ వాలా’ సినిమాని ఎంత కష్టపడి, ఇష్టపడి చేశాము. టీమ్ మొత్తం ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ మూవీలోని ఎమోషన్ అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, అలాగే బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో చాలా బాగా చూపించాం. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌లో రాజీవ్ కనకాల ప్రాణం పెట్టేశారు. రాజీవ్ కనకాల వంటి అద్భుతమైన నటుడుతో యాక్ట్ చేయడంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో వస్తుంది. కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అందరూ థియేటర్లకు వచ్చి, ఈ సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read- Grok Imagine 1.0: వీడియో జెనెరేషన్ టూల్ సూపర్ అడ్వాన్స్ వెర్షన్ తీసుకొచ్చిన మస్క్.. ఫ్రీగా ఎలా ఉపయోగించాలంటే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×