E-Paper
Advertisement

Chandini Chowdhary: పెళ్లికి సిద్ధమైన చాందినీ చౌదరి.. ఇందులో నిజం ఎంత..?

Chandini Chowdhary: పెళ్లికి సిద్ధమైన చాందినీ చౌదరి.. ఇందులో నిజం ఎంత..?
Advertisement

Chandini Chowdhary: టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో పెళ్లి వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ప్రముఖ నటీనటులు, సినీ కుటుంబాలకు చెందిన సెలబ్రిటీలు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొంతకాలం క్రితం సమంత, రాజ్ నిడిమోరు గురించి వార్తలు వచ్చాయి. అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి గురించి కూడా అనేక గాసిప్స్ వినిపించాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన ప్రేమించిన కావ్య రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. యువ మ్యూజిక్ డైరెక్టర్.. కాలభైరవ.. కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ యువ సంగీత దర్శకుడు.. రాజమౌళి ఫ్యామిలీకి చెందిన వారన్న విషయం తెలిసిందే. ఇతను స్వయాన ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కొడుకు. ప్రస్తుతం ఈ యువ సంగీత దర్శకుడు తన ప్రతిభతో పలు సినిమాలకు మంచి సంగీతం అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మధ్యస్థాయి సినిమాలు కూడా అతని మ్యూజిక్ వల్ల మంచి విజయాన్ని అందుకుంటున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక చాందిని చౌదరి విషయానికి వస్తే, ఆమె ఇటీవల తన నటనతో మంచి పేరు సంపాదించింది. కొన్ని సినిమాల్లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంటోంది. సినిమా పనుల సమయంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ… ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది.

పార్టీలకు సైతం హాజరు..!

Advertisement

ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ కలిసి తమ స్నేహితులతో పార్టీలకు హాజరవుతున్నారని, కలిసి బయట కనిపిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే గతంలో తమ రిలేషన్ గురించి బయటకు ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు.

ఇప్పుడు తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు కుటుంబాలు కూడా ఈ బంధాన్ని సానుకూలంగా స్వీకరించాయని కొన్ని వార్తలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు ఈ వార్తపై విభిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు వారు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అంతేకాకుండా చాలామంది ఇది కేవలం ఇంస్టాగ్రామ్ లో వచ్చే రూమర్లు మాత్రమే అని కూడా అంటున్నారు.. చాందిని చౌదరి తోనే కాదు వేరే హీరోయిన్ తో కూడా కాలభైరవాకి పెళ్లి అని సోషల్ మీడియాలో వార్తల వినిపిస్తున్నాయి. అందువల్ల ఇవన్నీ కేవలం గాసిప్స్ అయ్యి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Raashii Khanna: పెళ్లి పై రాశి ఖన్నా కామెంట్స్.. పెళ్లెప్పుడో చెప్పిన ముద్దుగుమ్మ?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×