E-Paper
Advertisement

FD Vs PPF: ఫిక్స్ డ్ డిపాజిట్ వర్సెస్ పీపీఎఫ్.. మీ డబ్బు ఎందులో స్పీడ్ గా పెరుగుతుంది?

FD Vs PPF: ఫిక్స్ డ్ డిపాజిట్ వర్సెస్ పీపీఎఫ్.. మీ డబ్బు ఎందులో స్పీడ్ గా పెరుగుతుంది?
Advertisement

FD Vs PPF: ఫిక్స్ డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. స్థిరమైన రాబడి ఇచ్చే సంప్రదాయ పెట్టుబడి మార్గాలు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే బ్యాంకు లేదా ఒక ఆర్థిక సంస్థలో నిర్థిష్ట కాలానికి స్థిరమైన వడ్డీ రేటుకు పెట్టుబడి పెట్టడం. మీ డబ్బులను సేమింగ్స్ అకౌంట్ లో ఉంచే కన్నా.. ఎక్కువ వడ్డీ రేటును అందించే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 1986లో స్టార్ట్ చేసిన PPF సాధారణంగా అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు అందిస్తున్న సేవింగ్స్ స్కీమ్. ఇది లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ఎక్కువ రాబడిని అందిస్తుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్

పిల్లల చదువులు, పెళ్లి, ఇతర ముఖ్యమైన అవసరం కోసం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే.. FDలు మంచి ఆలోచన. మీ బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని FD చేసుకోవడానికి అవకాశం ఉంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టైం పీరియడ్ తో FDలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. తక్కువ పీరియడ్ కు ఎఫ్డీ తీసుకుంటే.. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కొత్త ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

సీనియర్ సిటిజన్లకు

Advertisement

చాలా బ్యాంకులు తక్కువ కాలపరిమితి డిపాజిట్లతో పోలిస్తే మీడియం, లాంగ్ టర్మ్ FDలపై ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంటే ఎఫ్డీలకు ఎక్కువ వడ్డీ ఉంటుంది. దాదాపు అన్ని బ్యాంకులు సాధారణ పెట్టుబడిదారులతో పోలిస్తే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల ఇన్వెస్ట్మెంట్లకు కాస్త ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. ఎఫ్డీలకు వార్షిక వడ్డీ రేట్లు సాధారణంగా 5.5-7.75% మధ్య ఉంటాయి.

పీపీఎఫ్ స్కీమ్

PPF అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న సేవింగ్స్ స్కీ్మ్. పీపీఎఫ్ పై ఈ త్రైమాసికంలో 7.1% వడ్డీ రేటు ప్రకటించింది కేంద్రం. మెచ్యూరిటీ మొత్తం, వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్న వారికి పీపీఎఫ్ సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్. పోస్టాఫీసు లేదా బ్యాంకులలో ప్రతి నెలా కనీసం రూ.100-500 వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.

ట్యాక్స్ తీసేస్తే

Advertisement

PPF పై ఏడాదికి వడ్డీ 7.1 శాతంగా ఉంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేటును కేంద్రం నిర్ణయిస్తుంది. అయితే గత కొన్ని త్రైమాసికాలుగా పీపీఎఫ్ వడ్డీ రేటు స్థిరంగా ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెద్ద బ్యాంకులు సుమారు 6.5 నుంచి 7.3 శాతం వరకు వడ్డీ కోట్ చేస్తున్నాయి. పేపర్ చూస్తే వడ్డీ పరంగా FD కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. మీరు హై ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే FD వడ్డీపై ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ తీసేస్తే ఎఫ్డీపై వచ్చే రాబడి PPF రాబడి కంటే తక్కువగా ఉంటుంది.

Also Read:  మీ పిల్లల భవిష్యత్ కోసం 3 బెస్ట్ పెట్టుబడి పథకాలు

ఉదాహరణ

ఉదాహరణకు మీరు నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టారనుకోండి. 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలు. PPF 7.1% వడ్డీతో రూ. 34.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై ట్యాక్స్ పడదు. అదే బ్యాంక్ FD 7.50% వడ్డీ రేటుతో రూ. 33.8 లక్షలు వస్తుంది. పన్ను తర్వాత రూ. 27–29 లక్షలు చేతికొస్తుంది.
అదే పోస్ట్ ఆఫీస్ FD అయితే 7.50% వడ్డీ రేటుతో రూ. 33.8 లక్షలు అవుతుంది. ట్యాక్స్ తర్వాత రూ. 31 లక్షలు చేతికొస్తుంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×