E-Paper
Advertisement

గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యంగ్ హీరోయిన్.. పుత్రికోత్సాహంలో తల్లి.. ఫోటోలు వైరల్!

గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యంగ్ హీరోయిన్.. పుత్రికోత్సాహంలో తల్లి.. ఫోటోలు వైరల్!
Advertisement

Film industry: నటనే జీవితానికి ఆధారం కాదని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు నటిస్తూనే మరొకవైపు బిజినెస్ రంగంలో సత్తా చాటుతుంటే.. మరి కొంతమంది ఒకవైపు నటిస్తూనే.. మరొకవైపు ఉన్నత చదువులు చదువుతూ కెరీయర్కి పునాదులు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే శ్రీలీలను మొదలుకొని ఎంతోమంది హీరోయిన్లు ఒక వైపు సెట్ లో తమ పర్ఫామెన్స్ తో అదరగొడుతూనే.. మరొకవైపు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీ లీలా కూడా తన ఎంబిబిఎస్ కోర్స్ పూర్తి చేసి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వగా .. ఇప్పుడు మరొక యంగ్ హీరోయిన్ కూడా తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది.

గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యంగ్ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టి తెలుగు, తమిళ్ ,మలయాళం భాషలలో అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళీ బ్యూటీ అనికా సురేంద్రన్. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క చదువుకుంటూ కెరియర్ ను కొనసాగించిన ఈమె తాజాగా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇకపోతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని తెలిసి ఆమె తల్లి అనికానుముద్దులతో ముంచెత్తింది. పుత్రికోత్సాహంలో ఆ తల్లి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. గ్రాడ్యుయేషన్ డే రోజున స్నేహితులతో, తల్లితో దిగిన ఫోటోలను అనికా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మొత్తానికి అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో అభిమానులు, నెటిజన్లు అనికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ విషయానికొస్తే కొచ్చిలోని తేవరలో ఉన్న సేక్రేడ్ హార్ట్ కాలేజీలో తన చదువును పూర్తి చేసింది.

చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ వరకు.. అనికా కెరియర్..

Advertisement

ఈమె కెరియర్ విషయానికొస్తే మలయాళ కుట్టిగా.. బాలనటిగా నటనను మొదలుపెట్టింది. అలా తొలిసారి ‘కద తుదరున్ను’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా సమయానికి ఆమె వయసు కేవలం ఆరేళ్లు మాత్రమే. ఆ తర్వాత విశ్వాసం సినిమాలో అజిత్ -నయనతార కూతురుగా నటించి అప్పటినుంచి కుట్టి నయనతార అని పేరు దక్కించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ్ , మలయాళం భాషలో 15 సినిమాలు చేసిన ఈమె తెలుగులో ద గోస్ట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక 19 సంవత్సరాల వయసులో బుట్ట బొమ్మ అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. మలయాళంలో మాత్రం ఓ మై డార్లింగ్, కింగ్ ఆఫ్ కొత్త వంటి చిత్రాలు చేసిన ఈ తమిళంలో చేసిన ఒక చిత్రాన్ని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే డబ్బింగ్ వర్షన్ తో ఆకట్టుకుంది. అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలా తను చదువును పూర్తి చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

 

also read: అషురెడ్డి చీటింగ్ కేసు.. హైకోర్ట్ కీలక తీర్పు!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×