E-Paper
Advertisement

Ram Charan: రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..

Ram Charan: రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..
Advertisement

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న భావోద్వేగపూరితమైన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తండ్రిగా చరణ్ ఎదుగుదలను చూసి ఆయన పడుతున్న గర్వం, ఆ మాటల్లోని ప్రతి అక్షరంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినీ ప్రయాణం, ఆయన వ్యక్తిత్వంపై మెగాస్టార్ ఇలా చెప్పుకొచ్చారు.

Read also-Ustad Bhagat Singh: మొదటి వారం పవర్ చూపించలేని ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఇది సరిపోతుందా?

వారసత్వం నుంచి..

Advertisement

వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడం సామాన్యం కాదు. ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయమైన చరణ్, తొలి సినిమాతోనే తనలోని నటుడిని, డ్యాన్సర్‌ను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ టాలీవుడ్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, చరణ్‌ను మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసింది.

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తీరు..

‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ చూపిన నటన ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఇక ‘RRR’ సినిమాతో అల్లూరి సీతారామరాజుగా ఆయన పోషించిన పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. నేడు చరణ్ కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘గ్లోబల్ స్టార్’. చిరంజీవి గారు అన్నట్లు, ఆ చిన్నారి చరణ్ బాబు నేడు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలవడం నిజంగా గర్వించదగ్గ విషయం.

Advertisement

Read also-Gundeninda GudiGantalu Today episode: మీనాను దారుణంగా తిట్టిన ప్రభా.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. బాలుకు నిజం తెలుస్తుందా..?

సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా, చరణ్ తన వ్యక్తిగత జీవితానికి ఇచ్చే ప్రాముఖ్యత అమోఘం. మెగా కుటుంబంలోని ఐక్యతను కాపాడటంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తారు. షూటింగ్ సెట్‌లోనైనా, బయటైనా ఆయన పాటించే డిసిప్లిన్ తోటి నటులకు ఆదర్శం. ఏటా ఆయన తీసుకునే అయ్యప్ప మాల, ఆయనలోని ఆధ్యాత్మిక కోణాన్ని, నిరాడంబరతను చాటిచెబుతుంది. ఒక తండ్రికి తన కొడుకు విజయం కంటే మించిన ఆనందం ఏముంటుంది? “నువ్వు నడిచిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది” అన్న చిరంజీవి గారి మాటలు ప్రతి తండ్రి మనసులోని భావాలే. అభిమానుల గుండెల్లో ‘మెగా పవర్ స్టార్’గా, తండ్రి కళ్లలో ‘ముద్దుల చరణ్ బాబు’గా ఆయన ప్రయాణం దిగ్విజయంగా సాగుతోంది. ఇలా చెబుతూ ఆయన షేర్ చేసిన ఫోలోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

Big Stories

Advertisement
×