E-Paper
Advertisement

Chiranjeevi: చిరు గొప్ప మనసు..మేనేజర్ కూతురికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్…

Chiranjeevi: చిరు గొప్ప మనసు..మేనేజర్ కూతురికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్…
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన మంచి మనసు కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఆపద వచ్చింది అంటే వెంటనే నేనున్నానంటూ ముందుకు వస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ కార్మికులకు, నటీనటులకు అండగా నిలిచిన చిరంజీవి సామాజిక సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారు. ఎప్పటికప్పుడు తన గొప్ప మనసును చాటుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన మేనేజర్ కూతురికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.

బంగారు గొలుసు కానుకగా..

చిరంజీవి తన ఇంట్లో పని చేస్తున్న వారందరినీ కూడా సొంత వారిగా భావించి వారికి సంబంధించిన అన్ని వేడుకలలో పాల్గొంటూ సందడి చేస్తుంటారు. అయితే తాజాగా తన మేనేజర్ కూతురి నామకరణ వేడుకలలో సతీసమేతంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు సురేఖ కూడా హాజరవ్వడమే కాకుండా చిన్నారికి బంగారు గొలుసును కానుకగా అందజేసి స్వయంగా చిరంజీవి పాప పేరు అలేఖ్య అంటూ రివీల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు..

Advertisement

సాధారణంగా కొంతమంది తన ఇంట్లో పని చేసే స్టాప్ ను దూరం పెడుతుంటారు కానీ చిరంజీవి మాత్రం వారందరినీ కూడా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారని చిరంజీవి మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి సినిమా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

?igsh=MTJmNms5aThlYmt5Yw%3D%3D

Advertisement

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులను పూర్తి చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన మీసాల పిల్ల అంటూ సాగిపోయే పాట ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు చిరంజీవి విశ్వంభర సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలా, బాబి డైరెక్షన్ లో కూడా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ చిరు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

Big Stories

Advertisement
×