E-Paper
Advertisement

Meenakshi Chaudhary: స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి.. ఆమె రియాక్షన్ ఏంటంటే..?

Meenakshi Chaudhary: స్టార్ హీరోతో మీనాక్షి చౌదరి పెళ్లి.. ఆమె రియాక్షన్ ఏంటంటే..?
Advertisement

Meenakshi Chaudhary: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. ఈ ఏడాది ఈమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ విజయాన్ని సొంతం చేస్తుంది.. ఇటీవల మీనాక్షి నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 2021 సంవత్సరంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. సినిమాలతో బిజీగా ఉన్న ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్.. స్టార్ హీరోతో ప్రేమలో ఉందని గతంలో చాలాసార్లు వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు మరోసారి పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతుంది. వీటిపై మీనాక్షి రియాక్షన్ ఏంటి అన్నది ఆసక్తిగా మారింది.

త్వరలో హీరోతో మీనాక్షి పెళ్లి..?

ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోలేదు.. స్టోరీ డల్ గా ఉండటంతో మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో తన అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా మీనాక్షి గురించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఆమె పెళ్లి గురించి ఇటీవల ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా హీరో సుశాంత్ తో ప్రేమలో ఉందంటూ గతంలో రూమర్స్ వినిపించాయి. కానీ ఆ వార్తలపై స్పందించింది. ఇప్పుడు మరోసారి పెళ్లి పై పూకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందించినట్లు తెలుస్తుంది. నేను ఎవరితోనూ ప్రేమలో లేను.. ప్రస్తుతం నా కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేశాను అని చెప్పినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈమధ్య హీరోయిన్లు సడన్గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తున్నారు. ఏమి కూడా అలానే షాక్ ఇస్తుందేమో చూడాలి..

Advertisement

Also Read : పెళ్ళైన ఐదు రోజులకే పని మొదలెట్టిన సమంత.. డెడికేషన్ కు హ్యాట్సాప్..!

మీనాక్షి సినిమాల విషయానికొస్తే..

మీనాక్షి చౌదరి టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. అక్కినేని నాగ చైతన్య తో కలిసి ‘వృష కర్మ’ అనే చిత్రం లో నటిస్తోంది. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఈ సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి తో కలిసి ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ మూవీ వచ్చేయడాది సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రాబోతుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×