E-Paper
Advertisement

Chiranjeevi: మళ్ళీ సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ప్రమోషన్లకు అందుకే దూరమా?

Chiranjeevi: మళ్ళీ సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. ప్రమోషన్లకు అందుకే దూరమా?
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకరా వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నయనతార (Nayanthara) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇక ఎప్పుడు ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార కూడా రంగంలోకి దిగి తనదైన శైలిలోనే ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

మోకాలి సర్జరీ..

ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో ఈవెంట్స్ జరిగిన చిరంజీవి ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు దీంతో చిరంజీవి ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉన్నారనే సందేహం అభిమానులలో కలుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవికి సర్జరీ కావటం వల్లే ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో చిరంజీవి తీవ్రమైన మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సర్జరీ చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానున్న చిరు..

Advertisement

మరోసారి ఈయన తన కాలికి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ తన బాధను ఓర్చుకొని శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పూర్తి చేశారట .అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. అందుకని సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నారట. ఇక ఈ వారంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవితో పాటు చిత్ర బృందం హాజరు కాబోతున్నారని అక్కడి నుంచి ఈయన పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నట్టు సమాచారం.

అంచనాలు పెంచిన ట్రైలర్..

Advertisement

చిరంజీవి కాలికి సర్జరీ జరిగిన విషయాన్ని ఆయన టీమ్ రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది కచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా చిరు సినిమా నిలుస్తుంది అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాగా 11వ తేదీ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు.

Also Read: Varanasi Movie: పండగలాంటి వార్త.. మహేష్ బాబు వారణాసి విడుదల తేదీ ఫిక్స్?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×