E-Paper
Advertisement

KCR : అగ్గిరాజేసి చలికాచుకుంటున్న కేసీఆర్!

KCR : అగ్గిరాజేసి చలికాచుకుంటున్న కేసీఆర్!
Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఉన్నకాడ ఉండక రాష్ట్రంలో కొత్త పంచాయితీని తెరమీదకు తీసుకొచ్చారని.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కొత్తగా నీళ్ల జగడం రాజుకునేలా ఉందని రాష్ట్ర రాజకీయాల్లో టాక్ నడుస్తున్నది. కేసీఆర్ మొన్నటివరకు బయటకు రాలేదని అనుకున్న వారంతా ఇప్పుడు అసలు బయటకు రాకుండా ఉంటే అయిపోవ్ అని అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణభూతుడు. అలా అని ఆయన్ను ప్రజలు పట్టించుకోలేదా? అంటే రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు.

కేసీఆర్ జనాలకు ఏం చేశారు?

మరి అలాంటి వారికోసం కేసీఆర్ ఏం చేశారు? సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేశామని, ప్రాజెక్టులు కట్టామని,చెరువులు పునరుద్ధరించామని, జిల్లా భవనాలు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, రైతు రుణమాఫీ, దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, పెన్షన్లు పెంచామని ఇలా చాలానే చేశామని గులాబీ నేతలు చెప్పుకుంటుండగా.. మరి అవన్నీ చేస్తే తెలంగాణ ఇంకా బంగారు మయం ఎందుకు కాలేదు? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన కొత్తలో బంగారు తెలంగాణ చేసుకుందాం అని చాలా మార్లు చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేది.కేసీఆర్ గత పదేండ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎవరి హయాంలో అయ్యాయి?

అధికార దూరమయ్యాక నదీ జలాలు గుర్తొచ్చాయా?

Advertisement

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించారని రిపోర్టులు చెబుతున్నాయి. మరి అప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు. పదేండ్లు ప్రజలు మీకు అధికారమిస్తే పాలమూరును పక్కనబెట్టి ఏపీకి వెళ్లి అప్పటి సీఎం జగన్‌తో రాయలసీమకు కృష్ణా జలాలు ఇస్తామని ఎందుకు చెప్పారు? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు మాకు చాలని కృష్ణా ట్రిబ్యునల్ కమిటీలో ఎందుకు సంతకం చేశారు? ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నదీ జలాల తప్పులను నెట్టాలని చూడటం ఎంత వరకు కరెక్టు? ఇవే ప్రశ్నలు అడిగితే అసెంబ్లీకి రాకుండా సమాధానాలు చెప్పకుండా పీపీటీల పేరిట బీఆర్ఎస్ కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Uttam Kumar Reddy: అతి తెలివి ఎక్కువ.. పని తక్కువ.. బీఆర్ఎస్ పాలనపై ఉత్తమ్ కుమార్ ఆగ్రహం

ఏపీ జలదోపిడీ అప్పుడు తెలియదా?

Advertisement

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మిగులు గోదావరి జలాలు వాడుకోవచ్చని, కృష్ణా జలాలు సైతం ఇస్తామని చెప్పింది ఎవరు? అప్పటి సీఎం కేసీఆర్. తీరా అధికారం పోయాక, పార్టీ మీద ప్రజల్లో నమ్మకం పోతున్నదని తెలుసుకుని కొత్తగా నదీ జలాలపై అగ్గి రాజేయడం ఎంతవరకు కరెక్టు? తమ తప్పును కాస్త అధికార పార్టీ మీద వేసి అసెంబ్లీకి హాజరుకాకుండా, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు కరెక్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ లేవనెత్తిన అంశంపై ప్రస్తుతం ఏపీలోనూ చర్చ జరుగుతున్నది. అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం జరుగుతున్నది. కేసీఆర్ రాక రాక బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్న రెండు రాష్ట్రాల నడుమ అగ్గిరాజేసి చలికాచుకోవడం సమంజసమేనా? అని మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులు నిలదీస్తున్నారు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×