E-Paper
Advertisement

Chiranjeevi: వెంకీ సినిమాలో చిరు క్యామియో? డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్

Chiranjeevi: వెంకీ సినిమాలో చిరు క్యామియో? డైరెక్టర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్
Advertisement

Chiranjeevi: ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే తప్పకుండా ఆ సినిమాలో మరొక హీరో క్యామియో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఓకే సినిమాలో ఇద్దరు హీరోలు సందడి చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమాలో వెంకటేష్ వెంకి గౌడ(Venky Gowda) అనే పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ పాత్ర కేవలం అరగంట పాటు మాత్రమే ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి.

అనిల్ రావిపుడికి చిరంజీవి బంపర్ ఆఫర్..

ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడితో కలిసి వెంకటేష్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వెంకటేష్ తన సినిమాలో ఎలాగైతే నటించి సందడి చేశారో తాను కూడా వెంకటేష్ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నానని తెలియజేశారు. అనిల్ రావిపూడి మా ఇద్దరికీ సమానంగా క్యారెక్టర్లను రాస్తూ స్క్రిప్ట్ రెడీ చేసిన నేను వెంకటేష్ తో నటించడానికి సిద్ధంగా ఉన్నాను.

క్యామియో పాత్రలో చిరు..

Advertisement

ఇలా ఇద్దరి పాత్రలు సమానంగా కాకపోయినా ఒక చిన్న క్యామియో చేయడానికి అయినా తాను సిద్ధంగా ఉన్నానని మాకోసం ఒక స్క్రిప్ట్ రెడీ చెయ్యి అంటూ చిరంజీవి అనిల్ రావిపూడికి మరోసారి ఆఫర్ ఇవ్వడంతో మెగా విక్టరీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .మరి బాస్ కోరిన విధంగా అనిల్ రావిపూడి వీరిద్దరికీ కలిసి ఒక ఫుల్ లెన్త్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తారా? చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మూడు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

మహిళల ఆదరణ..

Advertisement

ఈ సినిమాకు ఎక్కువగా మహిళల ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం విడాకులు తీసుకొని విడిపోవాలనుకున్న ఓ జంట కూడా కలిసిపోయారని, ఈ సినిమా ద్వారా ఎంతో మందిలో మార్పు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి ఈ సినిమా విజయం పట్ల తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించారు. వెంకటేష్ వెంకి గౌడ అనే పాత్రలో సందడి చేశారు. ఈ చిత్రాన్ని సాహుగారపాటి సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

Also Read: Sivaji -Harsha vardhan: మహిళల వస్త్రధారణ … శివాజీ చేసిన తప్పు అదే: హర్షవర్ధన్

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×