E-Paper
Advertisement

Sivaji -Harsha vardhan: మహిళల వస్త్రధారణ … శివాజీ చేసిన తప్పు అదే: హర్షవర్ధన్

Sivaji -Harsha vardhan: మహిళల వస్త్రధారణ … శివాజీ చేసిన తప్పు అదే: హర్షవర్ధన్
Advertisement

Sivaji – Harsha Vardhan: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ (Sivaji)హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారితీసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమా వేడుకలో భాగంగా శివాజీ హీరోయిన్లు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్లు చేశారు. అలాగే కొన్ని అభ్యంతరకరమైన పదాలను కూడా వాడటంతో టాలీవుడ్ సెలబ్రిటీలు శివాజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. మరి కొంతమంది శివాజీకి మద్దతుగా తెలియజేశారు. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలలో తప్పులేదు కానీ ఆయన మాట్లాడిన విధానం తప్పు అంటూ మరికొందరు ఈ వివాదంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.

శివాజీ వివాదం పై హర్షవర్ధన్ కామెంట్స్..

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నటి అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. శివాజీకి కౌంటర్లు ఇస్తూ అనసూయ వరుస పోస్టులను షేర్ చేశారు. దీంతో అనసూయ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొంతమంది అనసూయకు మద్దతు తెలియజేయగా మరికొందరు తీవ్రస్థాయిలో ఈమెను విమర్శించారు. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే నటుడు హర్షవర్ధన్(Harsha Vardhan) కూడా ఈ వివాదంపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియపరిచారు.

బట్టలు స్వేచ్ఛలో భాగమే కానీ..

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ శివాజీ వ్యాఖ్యల గురించి మాట్లాడారు.”మనం వేసుకునే దుస్తులు స్వేచ్ఛలో భాగమే కానీ అవి మాత్రమే స్వేచ్ఛ కాదు” అంటూ హర్షవర్ధన్ పేర్కొన్నారు. దొంగల మనసు మార్చడం కంటే ఇంటికి తాళం వేయటం సులభం అనే ఉదాహరణతో జాగ్రత్తగా ఉండటాన్ని సమర్థించారు. శివాజీ ఉద్దేశం మంచిదైన చెప్పిన తీరు తప్పని తెలియజేశారు. ప్రదేశాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలని, ఇలాంటి సున్నితమైన అంశాలను చర్చించేటప్పుడు మనం మాట్లాడే మాటలలో కూడా స్పష్టత అవసరమని హర్షవర్ధన్ తన అభిప్రాయాలను తెలియజేశారు.

మన శంకర వరప్రసాద్ గారు..

Advertisement

శివాజీ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. స్పష్టంగా చెప్పని నేపథ్యంలోనే ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు అంటూ తెలియజేశారు. ఇక హర్షవర్ధన్ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా హర్షవర్ధన్ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన శివాజీ వివాదం పై స్పందించడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Also Read: Samantha -Raj Nidimoru: సంక్రాంతి వైబ్స్ అంటూ భర్తతో క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్ ..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×