Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా హీరో విజయ్ (Vijay)నటించిన జననాయగన్ (Jananayagan)సినిమా లీక్ అవడం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్ట్ చేశారు. హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఒక ఐదు నిమిషాల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అయ్యారు. సినిమా వాయిదా పడటంతో ఇప్పటికే ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు ఆన్లైన్ లో కనిపించడంతో చిత్ర బృందంతో పాటు విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా లీక్ అవడం పట్ల ఇప్పటికే పలువురు తమిళ హీరోలు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)సైతం ఈ సినిమా లీకవ్వడం పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. జననాయగన్(Jananayagan) సినిమా దురదృష్టవశాత్తు లీక్ అడం నన్ను తీవ్రంగా కలవర పెడుతోందని తెలిపారు.
దోషులకు శిక్ష పడాలి..
సినిమా అనేది ఒక నమ్మకం కృషి అలాగే ఎంతోమంది కలల మీద నిర్మించబడుతుంది. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తాయి. అలాగే మన పనిని కాపాడుకోవడం ఎంత కీలకమో ఇలాంటి సంఘటనలు గుర్తుచేస్తున్నాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో అలాగే ఈ చర్యలకు పాల్పడిన వారిని శిక్షించడంలో మేము ఎల్లప్పుడూ కేవీఎన్ ప్రొడక్షన్స్ వారికి మద్దతుగా నిలుస్తామని చిరంజీవి తెలిపారు. సినిమాని గౌరవించండి, సినిమాని రక్షించడానికి మనమందరం మన మద్దతును తెలియజేద్దాము.. పైరసీని అంతం చేయండి, సినిమాని కాపాడండి అంటూ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
We stand one with KVN…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం అంటే ఆ సినిమాపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పైరసీలను అంతం చేసినప్పుడే ఇండస్ట్రీ బ్రతుకుతుందనే ఉద్దేశంతో ఈ సినిమా లీక్ అవ్వడం పట్ల ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే చిరంజీవి సైతం కే వి ఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబి డైరెక్షన్ లో చిరంజీవి చేయబోతున్న మెగా 158 సినిమాకు కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. మెగా 158 రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉండగా ఈ సినిమా లీక్ అవడంతో తాత్కాలికంగా చిరు సినిమా పూజ కార్యక్రమాలను వాయిదా వేయబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read: జననాయగన్ లీక్ … వాయిదా పడిన మెగా 158 పూజ కార్యక్రమం..