E-Paper
Advertisement

నన్ను దేవుడే పంపాడు అన్నా.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం

నన్ను దేవుడే పంపాడు అన్నా.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగం
Advertisement

Jeevan Reddy Meets KCR:  తెలంగాణ మాసీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. తన పాత మిత్రుడిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే పంపాడు.. మీతో కలిసి పని చేయమని” అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి తన కుమారులు.. జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులతో కలిసి ఈ భేటీకి కావడం విశేషం.

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు తొలిసారి వచ్చిన జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తన మనసులోని మాటను కేసీఆర్‌తో పంచుకున్నారు. “తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరముంది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి నడిచే అవకాశం రావడం సంతోషంగా ఉంది.” అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు చూసిన ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ నాయకత్వం మళ్లీ అవసరమని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి పథం నుండి తప్పుకుంటోందని.. దానిని తిరిగి గాడిలో పెట్టే శక్తి కేసీఆర్‌కే ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ బలం మరింత పెరగడమే కాకుండా.. కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ బలోపేతానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఈ సందర్భంగా ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. తన రాజకీయ ప్రస్థానంలో చివరి అంకాన్ని కేసీఆర్ తో కలిసి సాగించబోతుండటం పట్ల జీవన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కలయిక తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారంతో 42 మంది లొంగుబాటు

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×