E-Paper
Advertisement

గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి, సోనుసూద్.. ఆర్థిక సహాయంతో పాటు ప్రాణదానం కూడా!

గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి, సోనుసూద్.. ఆర్థిక సహాయంతో పాటు ప్రాణదానం కూడా!
Advertisement

Tollywood:గత కొంతకాలంగా సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సమాజానికి సేవ చేయాలి అనే అంకితభావంతో పనిచేస్తున్న రియల్ హీరోలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలతో.. మరొకవైపు సేవాగుణంతో అందరి హృదయాలను దోచుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), సోనూసూద్ (Sonusood) లాంటి హీరోలు. ఇకపోతే తాజాగా వీరు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక సహాయంతో పాటు ప్రాణదానం కూడా చేసి రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.

కష్టాల్లో ఉన్నవారికి మెగా హస్తం..

మెగాస్టార్ చిరంజీవి నటుడు మాత్రమే కాదు ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపిన దైవం అనడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేను ఉన్నాను అంటూ ముందుండి భరోసా ఇస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వరుస సేవా కార్యక్రమాలు మెగాస్టార్ లోని మానవత్వాన్ని మరోసారి చాటిచెబుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు మరోసారి తనను నమ్ముకున్న వారికి పెద్దన్నయ్యగా నిలిచారు చిరంజీవి. కొంత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ కార్మికులకు , సన్నిహితులకు అండగా నిలుస్తున్నారు. తన వద్ద పనిచేసే మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ గుండె శస్త్రచికిత్స కోసం రూ.10.5 లక్షలు ఆర్థిక సహాయం అందించిన ఈయన.. తన మాజీ మేనేజర్ కెవి నరసయ్య కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి ఆయన భార్య బైపాస్ సర్జరీ కోసం వెంటనే రూ.9.5 లక్షలు అందజేశారు.

వ్యక్తులకే కాదు వ్యవస్థలకు కూడా..

Advertisement

వ్యక్తులకే కాకుండా వ్యవస్థల బలోపేతానికి కూడా చిరంజీవి అండగా నిలుస్తున్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు రూ.5 లక్షలు , ఇతర చారిటబుల్ ట్రస్టులకు రూ.10 లక్షల విరాళాలు అందించారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకు , చిరంజీవి ఐ బ్యాంకులు ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు త్వరలో విద్యార్థుల కోసం ఒక ట్రస్టుని కూడా స్థాపిస్తానని హామీ ఇచ్చారు చిరంజీవి.

ALSO READ:హార్ట్ బ్రేక్స్.. 4 నెలలు నిద్రలేమి.. కలకి, నిజానికి తేడా తెలిసేది కాదు -డైరెక్టర్ భార్య!

రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్..

Advertisement

సినిమాలలో విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల చేత తిట్లు తిన్న నటుడు సోనూసూద్ ఇప్పుడు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా సమయం నుంచే తన అసలు నిజ స్వరూపం బయటపడింది అని చెప్పాలి. ఆర్థికంగా భరోసా ఇవ్వడమే కాకుండా ప్రాణాలను కాపాడడంలో కూడా ముందు నిలిచారు . ఇక ఎప్పటికప్పుడు మానవతావాది అనిపించుకుంటున్న సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారికి జూపిటర్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో శస్త్ర చికిత్స చేయించి , ఆమెకు కొత్త జీవితాన్ని అందించారు. ఎన్నో చోట్ల నిరాశ ఎదురైనా.. ఆశ వదలని నీరా తల్లి పోరాటానికి సోనూ అండగా నిలిచారనే చెప్పాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎవరూ కూడా జీవితం పై ఆశ వదులుకోవద్దని ట్వీట్ చేశారు సోనూ సూద్.. ఇలా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ప్రజలకు అండగా నిలుస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×