E-Paper
Advertisement

హార్ట్ బ్రేక్స్.. 4 నెలలు నిద్రలేమి.. కలకి, నిజానికి తేడా తెలిసేది కాదు -డైరెక్టర్ భార్య!

హార్ట్ బ్రేక్స్.. 4 నెలలు నిద్రలేమి.. కలకి, నిజానికి తేడా తెలిసేది కాదు -డైరెక్టర్ భార్య!
Advertisement

Kalki Koechlin:సినిమా అనే రంగుల ప్రపంచంలో బయటకు కనిపించేదంతా బూటకం.. లోపల ఏదో తెలియని వెలితి.. సినీ సెలబ్రిటీల జీవితాలలో భరించలేని నరకం.. ఎప్పుడో ఒకసారి కుండబద్దలైతే తప్ప ఈ విషయాలన్నీ మనకు తెలియవనే చెప్పాలి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కో రూపంలో తమ బాధను బయట పెడితే.. మరి కొంతమంది ఆ బాధను దిగమింగుకుంటూనే ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇన్నేళ్ల ప్రయాణంలో మాజీ అయినప్పటికీ కూడా తన భర్తకు అండగా నిలిచి, నేడు ఆ బాధను ఎట్టకేలకు బయటకు పెట్టేసింది ప్రముఖ నటి. ఆమె ఎవరో కాదు కల్కి కోచ్లిన్.. రణవీర్ సింగ్ గల్లీ బాయ్స్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)ను వివాహం చేసుకున్న తర్వాత పలు చిత్రాలలో నటించింది. ఇకపోతే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడడం తనకు నిజంగా బాధ కలిగించిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఈమె.. ఆ తర్వాత అనుభవించిన నరకం గురించి ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా హార్ట్ బ్రేక్స్, నాలుగు నెలల నిద్రలేమితో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.

బ్రేకప్ తర్వాత నరకం అనుభవించా – కల్కి

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రముఖ నటి కల్కి కోచ్లిన్.. సోహ అలీ ఖాన్ నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొని.. తన మానసిక, శారీరక ఆరోగ్యం గురించి.. అనారోగ్య సమస్యల ప్రభావం తనపై చూపించినప్పుడు తన వ్యక్తిగత పోరాటం ఎలా ఉంది అనే విషయాలపై స్పందించింది.” నా వ్యక్తిగత జీవితంలో బ్రేకప్స్ కారణంగా నేను మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. హార్ట్ బ్రేక్స్ కారణంగా 4 నెలల పాటు నిద్రలేమితో బాధపడ్డాను. అర్ధరాత్రి రెండు, మూడు గంటలకే మేల్కొని నిద్ర రాక గిటారు వాయించేదానిని. దీంతో నా డైలీ రొటీన్ వర్క్ లైఫ్ చాలా గందరగోళంగా మారిపోయింది. అసలు ఆ సమయంలో కలకి నిజానికి తేడా కూడా నాకు తెలిసేది కాదు” అంటూ ఎమోషనల్ అయింది డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కోచ్లిన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా తన భర్త నుంచి విడిపోయాక ఈమె ఇంత నరకం అనుభవించిందా అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:నెల తిరగకుండానే ఓటీటీలోకి శర్వానంద్ బైకర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నా మాజీ భర్తను ఇంకొకరితో చూడలేకపోయాను..

ఇకపోతే ఈ విడాకుల విషయంపై గతంలో కూడా ఈమె స్పందించింది . నా భర్త అనురాగ్ నుంచి నేను విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడడం నాకు చాలా బాధగా అనిపించింది. విడాకుల తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు అంత సులభం కాలేదు. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ నా భర్తను వేరొకరితో చూడడం మరింత బాధగా అనిపించింది. కానీ జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయి కదా.. ఆ బాధను అధిగమించడానికి చాలా సమయమే పట్టింది. కానీ కాలక్రమేనా ఇద్దరం తిరిగి కలుసుకొని గౌరవప్రదమైన సంబంధాన్ని కొనసాగించే స్థితికి చేరుకున్నాము. నా తల్లిదండ్రులు కష్టమైన విడాకులను నేను చూశాను. అందుకే నా బ్రేకప్ ని నేను జీర్ణించుకోలేకపోయాను అంటూ తెలిపింది. ఇకపోతే అంత కష్టకాలంలో కూడా అనురాగ్ కశ్యప్ కూతురు వివాహ వేడుకలకు కల్కి హాజరయ్యింది.

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×