E-Paper
Advertisement

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!
Advertisement

Chiranjeevi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబ అన్నదమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుస్తూ.. అన్న మాట జవదాటని తమ్ముళ్లుగా నాగబాబు(Nagababu ), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య వెంటే నడుస్తూ తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ గా చలామణి అవుతున్న చిరంజీవి (Chiranjeevi) తన కుటుంబాన్ని సవ్య దిశలో నడిపిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. చిరంజీవి పవన్ కళ్యాణ్ పై తన ప్రేమను వలకబోస్తూ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ విషెస్..

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. తన మనసులోని మాటలకు అక్షర రూపం దాల్చారు. “కళ్యాణ్ బాబు.. తీర్మానాల పరిష్కర్త.. విశ్వాసంతో నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, ప్రతిక్షణం ప్రజలకు మేలు చేయాలనే స్వచ్ఛమైన మనసు.. ఇవన్నీ నేను మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. ఆయన చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తిగా లీనమైపోతారు. పదిమంది ప్రజల శ్రేయస్సును తీసుకురావాలనే తీవ్రమైన అభిరుచితో ప్రతి అడుగు వేస్తారు.

నిరంతరం నన్ను గర్వించేలా చేస్తారు -చిరంజీవి

Advertisement

మా కుటుంబం పట్ల ఆయన చూపించే ప్రేమని, తనను నమ్మిన ప్రజల పట్ల కూడా చూపిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం వంటి పనుల కోసం అంకితభావంతో పనిచేస్తూ, పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న ఎన్నో సమస్యలకు ఆయన శాశ్వత పరిష్కారాలు చూపుతూ, మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకువెళ్లే తీరు నాకు అపారమైన ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది.

also read:20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్ కు విజయం చేకూరాలి – చిరంజీవి

Advertisement

తనను ఎన్నుకున్న పిఠాపురం ప్రజలకు ఆయన కేవలం ప్రజాప్రతినిధి గానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా దృఢమైన అండగా నిలుస్తున్నారు. ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ తెలుగు ప్రజలందరి చేత ఆరాధించబడే నాయకుడిగా ఎదగాలని , తన భవిష్యత్తు లక్ష్యాల వైపు పయనిస్తున్న కళ్యాణ్ బాబుకు, ప్రతి అడుగులోనూ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన పూర్తిగా వందేళ్లు ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించాలని , మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా కుటుంబ దైవమైన ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నాను. మా కళ్యాణ్ బాబు అన్నా చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఒక సుదీర్ఘ పోస్టును తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఆకట్టుకుంటున్న ఫోటో..

ఇక అలాగే ఆయన కొన్ని ఫోటోలను కూడా పంచుకున్నారు. అందులో ఆప్యాయంగా తన తమ్ముడిని హగ్ చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అన్నదమ్ముల అనుబంధానికి అసలైన ప్రతీక అంటూ అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పంచుకున్న ఈ స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

హార్ట్ టచ్ ఫీలింగ్.. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్!

కావ్య మారన్ తో అనిరుధ్ పెళ్లి ఫిక్స్.. వారికి ప్రత్యేక ఆహ్వానం!

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

Big Stories

Advertisement
×