E-Paper
Advertisement

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Pallaburusu OTT: ఈ మధ్యకాలంలో థియేటర్లలో ఎలా అయితే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారో..ఇటు ఓటీటీలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లలేని ఎంతోమంది ఇటు ఓటీటీలలో తమకు వచ్చిన చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు దాదాపు 4 లేదా 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి.కానీ ఇక్కడ ఒక సినిమా థియేటర్లలో విడుదలై 20 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు..

ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది..అలా బలగం చిత్రంలో తమ నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), మురళీధర్ గౌడ్ (Muralidhar gowd) తండ్రి కొడుకులుగా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 14న విడుదలైన చిత్రం పళ్లబురుసు. అన్నపూర్ణ నిర్మాణ సంస్థ నిర్మాణంలో వచ్చిన ఈ చిన్న సినిమా ప్రమోషన్లలో పర్వాలేదనిపించారు. కానీ కంటెంట్ ఒక మాదిరిగా ఉండేసరికి జనాలు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే చడీ చప్పుడు లేకుండా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

also read:తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

పళ్లబురుసు స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే తెలంగాణలోని ఒక పల్లెటూరులో ఉండే వృద్ధుడు శంభు (సుధాకర్ రెడ్డి) ఒకసారి పంటి నొప్పితో హాస్పిటల్ కి వెళ్ళగా.. చికిత్స చేసిన డాక్టర్ వేప పుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో అది కొనివ్వమని శంభు తన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) ను అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తనను పిలవకుండా మనవరాలు పెళ్లిని కొడుకు చేయడంతో శంభు మరింత అవమానంగా ఫీల్ అవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకు పై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు.

ఈ ప్రశ్నలకు సమాధానమే పళ్లబురుసు..

Advertisement

ఇక ఈ కేసు వల్ల తండ్రి కొడుకులు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? స్వయానా కూతురు పెళ్లి జరుగుతుండగా.. తన తండ్రిని పిలవకపోవడం ఏమిటి? చివరికి ఏమైంది ? కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పునిచ్చింది? అనే విషయం తెలియాలి అంటే సినిమా తెరపై చూడాల్సిందే. ఎమోషనల్ భావోద్వేగాలతో పరవాలేదనిపించారు..కానీ ఈ స్టోరీని మరింత డెప్త్ గా రాసుకొని ఉండుంటే కచ్చితంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేదేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 20 రోజులు కూడా గడవక ముందే అప్పుడే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

Related News

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

Big Stories

Advertisement
×