E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి భుజానికి సర్జరీ… పూర్తిగా కోలుకుంటున్నానంటూ పోస్ట్!

Chiranjeevi: చిరంజీవి భుజానికి సర్జరీ… పూర్తిగా కోలుకుంటున్నానంటూ పోస్ట్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ నుంచి బయటపడక ముందే తన ఇంటికి వారసుడు రావడంతో మెగా ఆనందం రెట్టింపు అయింది. ఇటీవల ఈ చిన్నారులకు నామకరణ వేడుక కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలు వ్యక్తిగత విషయాలు ద్వారా చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఇటీవల చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో భాగంగా ఈయన తన షోల్డర్ కు బెల్ట్ వేసుకొని కనిపించారు దీంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.

చిరంజీవి భుజానికి కీ హోల్ సర్జరీ..

మెగాస్టార్ చిరంజీవి చేతికి ఏమైంది ఎందుకు ఈయన హ్యాండ్ బెల్ట్ వాడుతున్నారు అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు అయితే తన భుజానికి చిన్న సర్జరీ జరిగిందంటూ వార్తలు వచ్చాయి కానీ చిరంజీవి మాత్రం స్పందించలేదు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్వయంగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఆర్తోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ తో కలిసి దిగిన ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..”నా భుజానికి షోల్డర్ బెల్ట్ వాడటంతో ఎంతో మంది శ్రేయోభిలాషులను నా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరా తీస్తున్నారు. నా భుజానికి చిన్న కీ హోల్ సర్జరీ జరిగింది. నేను పూర్తిగా కోరుకుంటున్నాను త్వరలోనే నా రెగ్యులర్ పనులలో బిజీ కాబోతున్నానని తెలియజేశారు.

అభిమానులకు ధన్యవాదాలు..

Advertisement

ఈ సర్జరీలో భాగంగా ప్రముఖ ఆర్తోస్కోపీ డాక్టర్ నితిన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు నాకు ఎంతో సౌకర్యవంతంగా, నాపట్ల ఆయన చూపించిన శ్రద్ధ నైపుణ్యానికి కృతజ్ఞతలు అంటూ తెలియచేశారు. అదేవిధంగా నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు శ్రేయోభిలాషులకు కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా తన సర్జరీపై నేరుగా చిరంజీవి స్పందించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులకు ఒక స్పష్టత వచ్చింది. అయితే చాలా త్వరగా చిరంజీవి ఈ సర్జరీ నుంచి కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

ఇక చిరంజీవి ఈ సర్జరీ కారణంగానే తన తదుపరి సినిమా కూడా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది ఇటీవల ఈయన మోకాలికి కూడా సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా చేతికి కూడా సర్జరీ కావడంతో అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేశారు కానీ చిరంజీవి పూర్తిగా కోలుకుంటున్నానని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఈయన త్వరలోనే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి షూటింగ్ పనులను జరుపుకోబోతోందని తెలుస్తుంది.

Also Read: Allu Arjun -Atlee: అల్లు అర్జున్ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్…ఏమన్నా ప్లాన్ చేసావా అట్లీ?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×