E-Paper
Advertisement

8 A.M. Metro OTT : మెట్రోలో పెళ్ళయిన మహిళతో అలాంటి పని… క్లైమాక్స్ లో మైండ్ బెండయ్యే ట్విస్ట్

8 A.M. Metro OTT : మెట్రోలో పెళ్ళయిన మహిళతో అలాంటి పని… క్లైమాక్స్ లో మైండ్ బెండయ్యే ట్విస్ట్

8 A.M. Metro OTT : ‘కాంతారా 2’ నటుడు గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘8 AM మెట్రో’. 2023 లో వచ్చిన ఈ సినిమాలో సయామి ఖేర్ కథా నాయికగా నటించింది. పరిమితంగా థియేటర్లలో విడుదల అయినప్పటికీ ప్రశంసలు అందుకుంది ఈ హిందీ సినిమా. థియేటర్లలో విడుదలైన తరువాత ZEE5లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ మూవీ మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత కనెక్ట్ కానుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి అడుగు పెట్టింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘8 ఎ.ఎం. మెట్రో’ (8 A.M. Metro OTT) 2023లో హిందీలో వచ్చింది. స్టూడియో 99 బ్యానర్‌పై రాజ్ రాచకొండ & కిషోర్ గంజి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ రాచకొండ దర్శకత్వం వహించాడు. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మే 19న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని కవితలను ఆస్కార్ పురస్కార గ్రహీత గుల్జార్ రచించగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. ‘8ఎఎం మెట్రో’ 2024 మే 10 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

ఈ కథ చాలా సాదాసీదాగా, మనసుకి హత్తుకునేలా ఉంటుంది. నాందేడ్‌లో ఉండే ఇరావతి (సయామీ ఖేర్) అనే మహిళకి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. అయితే ఆమెకు రైలు ప్రయాణాలన్నా, రద్దీ అన్నా ఒక రకమైన భయం. ఒక రోజు హైదరాబాద్‌లో ఉన్న తన గర్భిణీ చెల్లెలికి సాయం చేయడం కోసం ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తుంది. అక్కడ ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు మెట్రోలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలోనే ఆమెకు ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. ప్రీతమ్ ఒక బ్యాంకర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి పుస్తకాలు, కవితలు అంటే చాలా ఇష్టం. ఇక స్టేషనులో ఇరావతికి భయంతో చెమటలు పడతాయి. ఆమెకు ప్రీతమ్ వాటర్ బాటిల్ ఇచ్చి భయాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తాడు.

మొదట్లో ఇద్దరూ అపరిచితులే అయినా, క్రమంగా వాళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ తమ జీవితాల్లోని బాధలు, గతాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటారు. ప్రీతమ్ తన మాటలతో, కవిత్వంతో ఇరావతిలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు. చివరికి వాళ్ళ ప్రయాణం ఎలాంటి ముగింపును ఇచ్చింది ? ట్రైన్ అంటే ఇరావతికి ఎందుకు అంత భయం? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మార్చురీలో మతిపోగొట్టే పనులు… గుండెలదిరే సీన్స్… హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి మావా

Related News

‘డెకాయిట్’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Friday OTT Releases : ఓటీటీ లవర్స్ కు పండగే.. శుక్రవారం ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్..!

జూన్ లో ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ కొరియన్ డ్రామాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

Big Stories

×