E-Paper
Advertisement

Chiranjeevi vs Allu Arjun: చిరంజీవి vs అల్లు అర్జున్..ఫిలిం ఫేర్ అవార్డ్స్ రికార్డ్స్ లో నిజం ఏమిటంటే..!

Chiranjeevi vs Allu Arjun: చిరంజీవి vs అల్లు అర్జున్..ఫిలిం ఫేర్ అవార్డ్స్ రికార్డ్స్ లో నిజం ఏమిటంటే..!
Advertisement

Chiranjeevi vs Allu Arjun: 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ముగిసిన వెంటనే తెలుగు సినీ అభిమానుల్లో ఒక పెద్ద డిబేట్ మొదలైంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న తర్వాత..ఆయన ఫిల్మ్‌ఫేర్ రికార్డులు చిరంజీవి రికార్డులకు సమానమా..లేదా దాటేశాడా.. అనే ప్రశ్నలు వినిపించాయి.

ఎవరిది పై చేయి..!

కానీ రికార్డుల విషయానికి వస్తే..అవార్డ్స్ సంఖ్యలను స్పష్టంగా చూడాలి. తెలుగు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఇప్పటికీ ఆల్‌టైమ్ రికార్డు చిరంజీవిదే. ఆయన ఈ కేటగిరీలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా దాటలేకపోయాడు.

Advertisement

చిరంజీవి ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. ఆయనకు సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. చిన్న చిన్న పాత్రలు, నెగటివ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించారు. కష్టపడి, క్రమశిక్షణతో, కాలానికి తగ్గట్టు మారుతూ, చివరకు మెగాస్టార్‌గా ఎదిగారు. ఆయన గెలుచుకున్న 7 బెస్ట్ యాక్టర్ అవార్డులు..ఒక్కటి రెండు హిట్ సినిమాల వల్ల కాదు.. ఎన్నో సంవత్సరాల కృషి అని చెప్పవచ్చు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే..ఆయనది వేరే తరం.. వేరే కాలం. సినీ కుటుంబం నుంచి వచ్చినా..తన నటనతో..డాన్స్‌తో, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరుగూ, వేదం, రేసుగుర్రం, పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్ సినిమాలకు గాను ఆయనకు 5 బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. ఇది నిజంగా గొప్ప విజయమే.

అయితే గందరగోళం ఎక్కడ వచ్చిందంటే..అన్ని కేటగిరీల్లో కలిపి చూసినప్పుడు అల్లు అర్జున్‌కు మొత్తం అవార్డుల సంఖ్య 7కి చేరింది. కానీ అది బెస్ట్ యాక్టర్ రికార్డుతో సమానం కాదు. సింపుల్‌గా చెప్పాలంటే..5 అవార్డులు 7 అవార్డులకు సమానం కావు.

Advertisement

ఈ పోటీలో మహేశ్ బాబ్ కూడా ఉన్నారు. ఆయనకు కూడా 5 బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. వెంకటేష్, నాగార్జున లాంటి నటులకు కూడా పలువురు అవార్డులు ఉన్నా, 7 మార్క్‌ను ఎవరూ దాటలేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సాధించిన విజయాలు కొత్త తరం తెలుగు సినిమాల బలాన్ని చూపిస్తున్నాయి. కానీ చరిత్ర, గణాంకాల ప్రకారం బెస్ట్ యాక్టర్ కిరీటం ఇంకా చిరంజీవిదే. భవిష్యత్తులో అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు ఇంకో రెండు అవార్డులు గెలిస్తే చరిత్ర మారవచ్చు. అప్పటివరకు, శూన్యం నుంచి శిఖరం వరకు ఎదిగిన ఒక స్వయం నిర్మిత స్టార్ పెట్టిన 7 అవార్డుల రికార్డు అచంచలంగా నిలిచే ఉంటుంది.

ALSO READ: Hero Vikram: ఆశ్చర్యపరుస్తున్న హీరో విక్రమ్ లైనప్..ఈ స్పీడేంటి బాసూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×