E-Paper
Advertisement

Hyderabad Water Board: గ్రేటర్‌లో నీటి వృథా ఫిర్యాదుల స్వీకరణకు.. ప్రత్యేక మొబైల్ యాప్..!

Hyderabad Water Board: గ్రేటర్‌లో నీటి వృథా ఫిర్యాదుల స్వీకరణకు.. ప్రత్యేక మొబైల్ యాప్..!
Advertisement

Hyderabad Water Board: నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా సీవరేజ్ సమస్యలను గుర్తించడానికి జలమండలి చేపట్టిన జలమండలి బస్తీ బాట రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీ నగర్ కాలనీ ప్రాంతంలో అధికారులతో కలిసి ఎండీ పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇండ్లను సందర్శించిన ఎండీ నీటి సరఫరాలో సమస్యల కోసం ఆరా తీశారు. క్యూ ఏటీ సిబ్బందితో కలిసి క్లోరిన్ స్థాయిలు, నీటి ప్రెషర్, నీటి సరఫరా సమయాలపై సమీక్షించారు. సీవరేజీ నెట్ వర్క్ పై కాలనీ వాసులతో చర్చించారు. కాలనీలలో విస్తృతంగా సందర్శించిన జలమండలి ఎండీ కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

నీటిని వృథా చేయకూడదని..

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నీటిని వృధా చేయకుంటే, పొదుపు చేసినట్టే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు. విద్యావంతులు నీటి పొదుపు పట్ల మరింత బాధ్యతగా ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించడంలోను ముందుండాలని కోరారు. జలమండలి సుదీర్ఘ ప్రాంతాలనుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నగరవాసుల నీటి అవసరాలను తీర్చడానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించి, శుద్ధి చేసి నగర ప్రజలకు సరఫరా చేస్తోందని వివరించారు. కావున నీటిని వృథా చేయకూడదని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నీటిని వృధా చేస్తున్న వారిని గుర్తించి, మళ్ళీ పునరావృత్తం అయితే పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: High Blood Sugar: బ్లడ్ షుగర్ పెరుగుతోందా? ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు!

భూగర్భజలాల పరిస్థితి..

నీటిని వృధా చేసే వారిపై ఫిర్యాదు చేయడానికి త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా నీటిని వృథా చేస్తున్న వారిపై పౌరులు ఎవరైనా ఫోటో అప్ లోడ్ చేసి, ర్యాదు చేయవచ్చన్నారు. అధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా వారికి పెనాల్టీ విధిస్తారని ఎండీ వివరించారు. ఆ ప్రాంతాల్లో భూగర్భజలాల పరిస్థితిని, బోరుబావుల స్థితిగతులను ఎండీ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ డిమాండ్, బుకింగ్, డెలివరీ సమయాలపై సమీక్షించారు. అనంతరం ఎండీ ఖాజాగూడ చెరువు దిగువ ప్రాంతం, మణికొండ, చిత్రపురి కాలనీ ప్రాంతాల నుండి ఉత్పత్తి అయ్యే మురుగును శుద్ధి చేయుటకు చిత్రపురి హిల్స్ సమీపంలో 30 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న చిత్రపురి మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.

Advertisement

Also Read: GHMC: ముగిసిన నోటీసుల జారీ.. ఇక వచ్చేవారం నుంచి ఆస్తులు సీజ్..?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×