E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవి చేతికి గాయం… షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్!

Chiranjeevi: చిరంజీవి చేతికి గాయం… షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చిన హీరో.. ఆందోళనలో ఫ్యాన్స్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఒకవైపు సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా మరోవైపు తన కొడుకు రామ్ చరణ్ కు కవల పిల్లలు జన్మించడంతో మెగా ఆనందం రెట్టింపు అయిందని చెప్పాలి. మెగా ఇంట్లో వరుస వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ ఎంతో హడావిడిగా ఉన్నారు. నేపథ్యంలోని చిరంజీవికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చేతికి కట్టుతో కనిపించిన చిరు..

ఈ ఫోటోలో ఈయన తన ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకొని కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు చిరంజీవి చేతికి ఈ బెల్ట్ ఎందుకు వేసుకున్నారు? తన చేతికి ఏం జరిగింది? ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ వరుస సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అల్లు శిరీష్ మార్చి 6వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెళ్లి వేడుకలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే తన పెళ్లి మొదటి శుభలేఖను తన మేనత్త సురేఖ చిరంజీవి దంపతులకు అందచేయడం కోసం అల్లు అరవింద్ దంపతులతో పాటు అల్లు శిరీష్ కూడా వెళ్లారు..

చిరంజీవి చేతికి ఏమైంది?

Advertisement

ఇలా తన పెళ్లి మొదటి శుభలేఖను చిరంజీవి దంపతులకు అందిస్తూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో భాగంగా చిరంజీవి తన ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకోవడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఎందుకు ఆ బెల్ట్ వాడుతున్నారు తన చేతికి ఏదైనా గాయం అయిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈయన మోకాలికి కూడా సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మోకాలి సర్జరీ కారణంగానే బాబీ సినిమా కాస్త ఆలస్యమైందని తెలుస్తోంది.

విడుదలకు సిద్ధంగా విశ్వంభర..

తాజాగా తన చేతికి బెల్ట్ వేసుకొని కనిపించడంతో మళ్లీ మెగాస్టార్ చేతికి ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయితే తనకు ఏం జరిగినా త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా త్వరలోనే పూజ కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతున్నారు. చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. వశిష్ట దర్శకత్వంలోతెరకెక్కిన విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించారు.

Advertisement

Also Read: Allu Sirish: అల్లు శిరీష్ పెళ్ళి శుభలేఖ… మొదటి ఆహ్వాన పత్రిక అందుకున్న చిరంజీవి!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×