E-Paper
Advertisement

Chiranjeevi Surekha: సతీమణికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ నోట్.. ఫోటోలు వైరల్..

Chiranjeevi Surekha: సతీమణికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ నోట్.. ఫోటోలు వైరల్..
Advertisement

Chiranjeevi Surekha: తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి భర్యాగా, రామ్ చరణ్ తల్లిగా, అల్లు రామలింగయ్య కూతురిగా సురేఖ కొణెదల అంటే తెలియని వారుండరు. తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. తన విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి తన భార్య అని చెబుతూ ఆయన రాసిన సందేశం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. “నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ఫిబ్రవరి 20, 1980న మనం వివాహం చేసుకున్న రోజు నుండి, నువ్వే నా అతిపెద్ద బలం. నీ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ తరుణంలో, అలాగే మన వివాహ వార్షికోత్సవం (ఫిబ్రవరి 20) రాబోతున్న వేళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అంటూ చిరు తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

Read also-Jagapathi Babu: సౌందర్య మరణం కంటే ఆయన మరణమే నన్ను సగం చంపేసింది- జగపతిబాబు

కుటుంబానికి కేంద్రబిందువుగా..

Advertisement

సురేఖ ఇంటిని ఎంత అద్భుతంగా చక్కదిద్దారో చెబుతూ చిరంజీవి గారు ఇలా రాసుకొచ్చారు. ఆమె మన కుటుంబానికి కేంద్రబిందువు. అందరినీ ప్రేమతో ఒకటిగా ఉంచే శక్తి ఆమెది. నా కుటుంబ సభ్యులను తన సొంతవారిగా భావించి, నా తల్లిదండ్రులకు ఒక కన్నకూతురిలా మారిపోయారు. వారు కూడా సురేఖను అంతే ఆప్యాయంగా స్వీకరించారు. చాలామంది చిరంజీవి సక్సెస్ వెనుక ఆయన కష్టం, ప్రతిభ ఉన్నాయని అంటుంటారు. కానీ, చిరు మాత్రం తన సక్సెస్ క్రెడిట్ మొత్తం భార్యకే ఇచ్చారు. “ఎవరైనా నా విజయ రహస్యం ఏమిటని అడిగితే.. అది నా టాలెంట్ అనో, హార్డ్ వర్క్ అనో చెప్పను. ‘అది నువ్వే’ అని చెబుతాను. ఇంటి బాధ్యతలన్నింటినీ నువ్వు నిశ్శబ్దంగా, సమర్థవంతంగా భుజాన వేసుకున్నావు కాబట్టే.. నేను నా వృత్తి మీద పూర్తి దృష్టి పెట్టగలిగాను.”

Read also-Siddu Rambo: సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే.. మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లోగింగ్..

నువ్వు నా బలం..

Advertisement

కష్టాల్లోనూ, సంతోషాల్లోనూ సురేఖే తమ కుటుంబాన్ని ఏకం చేసి ఉంచారని చిరంజీవి కొనియాడారు. “నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే కాదు.. నా బలం, నా సపోర్ట్ సిస్టమ్, నా ప్రశాంతత. నేను ఈ రోజు ఏ స్థితిలో ఉన్నానో అది కేవలం నీ వల్లే. నా ప్రేమ ఎప్పటికీ నీకే” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. చిరంజీవి ఆయన భార్యపై చూపిన ఈ అపారమైన గౌరవం, ప్రేమ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. “నిజమైన మెగాస్టార్ విజయానికి వెనుక ఉన్న మెగా పవర్ సురేఖ గారే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సురేఖపై చిరుకి ఎనలేని ప్రేమ ఉందని మరోసారి నిరూపించుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×