E-Paper
Advertisement

Jagapathi Babu: సౌందర్య మరణం కంటే ఆయన మరణమే నన్ను సగం చంపేసింది- జగపతిబాబు

Jagapathi Babu: సౌందర్య మరణం కంటే ఆయన మరణమే నన్ను సగం చంపేసింది- జగపతిబాబు
Advertisement

Jagapathi Babu:టాలీవుడ్ వెండితెరపై సౌందర్య(Soundarya), జగపతి బాబు(Jagapathi Babu)లది ఒక అపురూపమైన జంట. ప్రియురాలు, సర్దుకుపోదాం రండి, పెళ్లి పీటలు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన ఈ జోడీకి ఆఫ్ స్క్రీన్ లోనూ మంచి స్నేహం ఉండేది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు తన బాధను పంచుకుంటూ, సౌందర్య మరణం కంటే ఆమె సోదరుడు అమర్‌నాథ్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎమోషనల్ అయ్యారు. ఆ ప్రమాద వార్త విన్నప్పుడు తన పరిస్థితిని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వెండితెరపై హిట్ జోడీ.. నిజజీవితంలో ప్రాణ స్నేహితులు:

జగపతి బాబు, సౌందర్య కలిసి దాదాపు ఏడు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించి మెప్పించారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసి అప్పట్లో వీరిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే కాదు అనే పుకార్లు కూడా వచ్చేవి. వాటిని ఎప్పుడు పట్టించుకోలేదు. ఇక నిజానికి వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో స్నేహంగా ఉండేవారు.  దొంగాట, పెళ్లి పీటలు,అల్లరి ప్రేమికుడు, చిలకపచ్చ కాపురం వంటి సినిమాలు వీరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం. సౌందర్య సోదరుడు అమర్‌నాథ్ కూడా జగపతి బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ స్నేహం వల్లే వీరి కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉండేవి. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే వీరి స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకునేవారు.

ఒక్క ఫోన్ కాల్..నన్ను కుదిపేసింది:

Advertisement

2004లో జరిగిన ఆ ఘోర హెలికాప్టర్ ప్రమాదం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆ సమయంలో జగపతి బాబు విదేశాల్లో ఉన్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఆనాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. “నాకు ఫోన్ వచ్చింది.. సౌందర్య చనిపోయిందని చెప్పారు. వెంటనే నేను అమర్ (సౌందర్య సోదరుడు) ఎలా ఉన్నాడు అని అడిగాను. అతనికి ఏమైనా జరిగితే మాత్రం నాకు చెప్పొద్దు అని ఫోన్ పెట్టేశాను” అంటూ ఆవేదన చెందారు. కానీ విధి చాలా బలీయమైనది, ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు అమర్‌నాథ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం తనను సగం చంపేసినంత పని చేసిందని ఆయన ఎమోషనల్ గా చెప్పారు.

also read:Premabhishekam Film: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు.. స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!

తరాలు మారినా చెరిగిపోని జ్ఞాపకం ఈ జంట:

Advertisement

సౌందర్య మనల్ని విడిచి వెళ్లిపోయి ఏళ్లు గడుస్తున్నా, ఆమె నటన మరియు వ్యక్తిత్వం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి. జగపతి బాబు పంచుకున్న ఈ విషయాలు చూస్తుంటే, సినిమా గ్లామర్ ప్రపంచానికి అవతల ఎంతటి స్వచ్ఛమైన స్నేహాలు ఉంటాయో అర్థమవుతుంది. ఇక ఆ ప్రమాదం జరగకుండా ఉంటే ఈ హిట్ జోడీ మరిన్ని అద్భుతమైన సినిమాల్లో మనల్ని అలరించేది. ఏది ఏమైనా, వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాయకమైన కథగానే మిగిలిపోతుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×