MSVPG Film: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం మన శంకర్ వరప్రసాద్(MSVPG). ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరొక ఏడు రోజులలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రతి సినిమా విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మన శంకర్ వరప్రసాద్ గారి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ తో పాటు 2 గంటల 42 నిమిషాల నిడివితో రన్ టైం లాక్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుంది.ఈ సినిమా రన్ టైం ఫర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. ఇలా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. అలాగే ట్రైలర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. యాక్షన్ సన్ని వేషాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ సన్నివేశాలను కలబోస్తూ విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది.
ఈ ట్రైలర్ చూసిన అనంతరం మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరు బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా అంటే సినిమా పట్ల మంచి అంచనాలే ఉంటాయి. ఇప్పటివరకు అనిల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను నిరాశపరచలేదు. దీంతో మెగా అభిమానులు చిరు సినిమాపై కూడా ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార శశిరేఖ పాత్రలో నటించారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా చిరంజీవికి ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు. సుమారు 25 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.
రా ఏజెంట్ గా చిరు..
చిరంజీవి వెంకటేష్ మధ్య కొనసాగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో కూడా వెంకటేష్ మాస్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి రా ఏజెంట్ గా కనిపించబోతున్న విషయాన్ని ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే జనవరి 11వ తేదీ ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లు ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Anil Sunkara On bhola Shankar: భోళా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యింది.. ఓపెన్ అయిన అనిల్ సుంకర