E-Paper
Advertisement

Christmas 2025 Movies : బాక్సాఫీస్ వద్ద ‘మినీ కురుక్షేత్రం’…ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్

Christmas 2025 Movies : బాక్సాఫీస్ వద్ద ‘మినీ కురుక్షేత్రం’…ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్
Advertisement

Christmas 2025 Movies : డిసెంబర్ 25వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన మినీ కురుక్షేత్రం జరగబోతోంది. క్రిస్మస్ పండుగ వేళ ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది చిత్రాలు థియేటర్ల ముందు క్యూ కడుతున్నాయి. ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా పండుగ సీజన్లలో రెండు లేదా మూడు పెద్ద సినిమాలు పోటీ పడటం సహజం. కానీ ఈ ఏడాది సీన్ మారింది. క్రిస్మస్ పండుగను టార్గెట్ చేసుకుని ఏకంగా 10 సినిమాలు బాక్సాఫీస్‌పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఒకేరోజు 10 సినిమాలు:
డిసెంబర్ 25న ఛాంపియన్, శంభాల, పతంగ్, దండోరా, ఈషా, చెడ్డ అమ్మాయి వంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు.. వృషభ, మార్క్, 45, అనకొండ వంటి ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’, ఆది సాయికుమార్ నటించిన ‘శంభాల’ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, టీజర్లు ఈ చిత్రాలపై బజ్ క్రియేట్ చేశాయి. అయితే అదే రోజు మరో 8 సినిమాలు విడుదల కానుండటంతో వాటి ప్రభావం ఈ రెండు సినిమాపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అన్నీ చిన్న సినిమాలే అయినా, ఒక్కసారైనా చూడాలనిపించే సినిమాలు ఈ లిస్ట్‌లో ఉండటం ఇక్కడ మరో విశేషం.

Advertisement

‘అఖండ 2’ కారణంగానే:
అసలు ఒకే రోజు ఇన్ని సినిమాలు పోటీ పడటానికి ప్రధాన కారణం ‘అఖండ 2’. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 12కు వాయిదా పడటం, ఆపై థియేటర్ల వద్ద ‘అఖండ 2’ హవా కొనసాగడంతో.. చాలా చిన్న సినిమాలు తమ రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 25కి మార్చుకున్నాయి. ‘అఖండ 2’ ప్రభావం ఇప్పటికే మోగ్లీ సినిమాపై తీవ్రంగా కనిపించింది. మోగ్లీ సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. దీంతో అఖండ వంటి భారీ సినిమా ముందు తమ సినిమా మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు తమ సినిమాలను డిసెంబర్ 25కి వాయిదా వేసుకున్నారు.

థియేటర్లు కష్టమే: 
అయితే ఒక్క రోజు 10 సినిమాలు అంటే అది కచ్చితంగా రిస్క్ అని చెప్పాలి. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్లలో ‘అఖండ 2’ తో పాటు హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్ 3’ కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ దశలో 10 కొత్త సినిమాలు వస్తే.. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. థియేటర్లలో షోలను పంచుకోవడం వల్ల వల్ల ఏ సినిమాకూ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చు.

Advertisement

ప్రేక్షకుల అడుగు ఎటువైపు..?
పది ఆప్షన్లు ఉన్నప్పుడు ప్రేక్షకులు సహజంగానే మంచి టాక్ వచ్చిన సినిమా చూడటానికే మొగ్గు చూపుతారు. దీనివల్ల కంటెంట్ బాగున్నా, సరైన ప్రచారం లేని చిన్న సినిమాలు మొదటి రోజే ఫేడవుట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పోటీలో నిలబెట్టేది కేవలం కంటెంట్ మాత్రమే. అది ‘ఛాంపియన్’ అయినా, ‘శంభాల’ అయినా.. సినిమా బాగుందనే మాట వినపడితేనే ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేస్తారు.ఫైనల్‌గా చెప్పాలంటే.. డిసెంబర్ 25న విడుదలయ్యే 10 చిత్రాల్లో ఏది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందో, ఏది బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో వేచి చూడాలి. ఈ పోటీలో నిర్మాతలకు రిస్క్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం పండుగ వేళ పసందైన వినోదం దొరకడం ఖాయం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×