E-Paper
Advertisement

Chanakya Niti: మంచివారే త్వరగా మోసపోతారా? చాణక్యుడు చెప్పిన ‘సెల్ఫ్ డిఫెన్స్’ సూత్రాలివే !

Chanakya Niti: మంచివారే త్వరగా మోసపోతారా? చాణక్యుడు చెప్పిన ‘సెల్ఫ్ డిఫెన్స్’ సూత్రాలివే !
Advertisement

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. మంచితనం అనేది ఒక గొప్ప గుణం. కానీ అది బలహీనతగా మారకూడదు. ఆచార్య చాణక్యుడు తన ‘నీతి శాస్త్రం’లో లోకజ్ఞానం గురించి, వ్యక్తుల స్వభావం గురించి అమూల్యమైన సూత్రాలను అందించారు. “అతి వినయం ధూర్త లక్షణం” అని ఆయన హెచ్చరించారు. అంటే మితిమీరిన మంచితనం లేదా వినయం ఒక్కోసారి ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి దారి తీస్తుంది.

Advertisement

మంచితనాన్ని కాపాడుకుంటూనే.. ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా ఉండటానికి చాణక్యుడు చెప్పిన ప్రధాన సూత్రాలు :

1. అతి మంచితనం ప్రమాదకరం:

Advertisement

చాణక్యుడు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు.అడవికి వెళ్తే అక్కడ నిటారుగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారు. వంకరగా ఉన్న వాటిని వదిలేస్తారు. అలాగే సమాజంలో అతిగా అమాయకంగా.. ఎప్పుడూ అందరికీ తలొగ్గి ఉండేవారిని లోకం త్వరగా వాడుకుంటుంది. కాబట్టి.. మనస్సులో దయ ఉన్నా, బయట ప్రపంచానికి మాత్రం మీరు అంత తేలికగా లొంగిపోయే వ్యక్తి కాదని తెలియజేయాలి.

2. మీ బలహీనతలను ఎవరికీ చెప్పకండి:

చాణక్యుడి ప్రకారం.. మీ రహస్యాలను లేదా బలహీనతలను అత్యంత సన్నిహితులతో కూడా పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికి భయపడతారో లేదా దేనికి లొంగుతారో ఎదుటి వారికి తెలిస్తే.. వారు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి లేదా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ మంచితనం మీ బలం కావాలి కానీ, మీ బలహీనత కాకూడదు.

3. ‘కాదనడం’ (No చెప్పడం) నేర్చుకోండి:

చాలా మంది మంచితనం వల్ల ఎదుటివారు అడిగిన ప్రతిదానికీ ‘సరే’ అంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. ధర్మబద్ధం కాని పనులకు లేదా మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగించే పనులకు నిస్సంకోచంగా ‘లేదు’ అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని కఠినంగా చూపదు. సరిగ్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిగా నిలుస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×