E-Paper
Advertisement

Christmas Releases 2025 : క్రిస్మస్ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఏ సినిమాను ఎందుకు చూడాలంటే?

Christmas Releases 2025 : క్రిస్మస్ రోజు రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఏ సినిమాను ఎందుకు చూడాలంటే?
Advertisement

Christmas Releases 2025 : డిసెంబర్ నెల మరికొన్ని రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది. ఈనెలలో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి.. అందులో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా లేకపోవడంతో చిన్న సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. డిసెంబర్ 12న చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా జనాలను పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం క్రిస్మస్ కి రిలీజ్ కాబోతున్న సినిమాల కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు తో పాటు మిగిలిన భాషల్లో కూడా డిసెంబర్ 25న బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

క్రిస్మస్ రోజు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే.. 

ఛాంపియన్.. 

రోషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘చాంపియన్‌’. అనస్వర రాజన్‌ కథానాయిక. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి ఈ సినిమా రాబోతుంది..

దండోరా.. 

Advertisement

‘కలర్ ఫొటో’, బ్లాక్‌బస్టర్ ‘బెదురులంక 2012’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెన‌ర్జీ నిర్మిస్తున్న తాజా చిత్రం దండోరా.. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శంబాల.. 

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శంబాల.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది..

ఈషా..

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, త్రిగుణ్ మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ఈషా… ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

పతంగ్..

ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ‘పతంగ్‌’. గౌతమ్‌ వాసుదేవమీనన్‌, ఎస్పీ చరణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది..

బ్యాడ్ గాళ్స్.. 

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య మన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్యాడ్ గాళ్స్.. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా తెరకెక్కింది.. ఫణి ప్రదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 25న సినిమా థియేటర్లలోకి రాబోతుంది..

సిరై.. 

విక్రమ్ ప్రభు నటించిన ఒక రాబోయే తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సిరై.. సురేష్ రాజకుమారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 25న విడుదల కాబోతుంది.

మార్క్.. 

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ కిచ్చా సుదీప్ న‌టిస్తోన్న లేటెస్ట్ చిత్రం మార్క్ . మ‌రోమారు ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.

వీటితో పాటుగా 45వ మూవీ, మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం వృషభ, వానర, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వంటి సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా క్రిస్మస్ కానుకగా 25న ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.. వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందో చూడాలి..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×