Singer Mangli: టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ (Mangli)గత కొద్ది రోజులుగా మైక్రో ఫైనాన్స్(Micro Finance) కేసు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగంగా ఈమెపై ఎన్నో ఆరోపణలు రావడమే కాకుండా తన పట్ల కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో న్యాయం కోరుతూ హైదరాబాద్ సివిల్ కోర్టు మెట్లు ఎక్కారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో భాగంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న అసత్య ప్రచారాలపై ఈమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్యపు వార్తలను వెంటనే తొలగించాలని ఈమె కోర్టును ఆశ్రయించారు.
ఇలా మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా సిటీ సివిల్ కోర్టు(City Civil Court)ను ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేయగా కోర్టు మంగ్లీ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ విచారణ అనంతరం కోర్టు సింగర్ మంగ్లికి కాస్త ఉపశమనం కల్పించింది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగంగా సింగర్ మంగ్లికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రచారాలు చేయకూడదు అంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈమెకు సంబంధించి ఏ విధమైనటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ పెట్టడానికి వీలు లేదంటూ కోర్టు తీర్పు వెల్లడించింది.
ఇకపై సోషల్ మీడియాలో మైక్రో ఫైనాన్స్ వివాదానికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టకూడదు అంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మంగ్లీ కాస్త ఉపశమనం లభించిందని చెప్పాలి.. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. మరి మే 15వ తేదీ జరిగే విచారణలో భాగంగా కోర్టు నుంచి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందనేది తెలియాల్సి ఉంది. మంగ్లీ ఆమె సోదరుడు శివ మైక్రో ఫైనాన్స్ పేరిట సుమారు వంద కోట్లకు పైగా స్కాం చేశారు అంటూ అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
A5 నిందితురాలిగా మంగ్లీ..
ఈ వ్యవహారంలో సింగర్ మంగ్లీపై కూడా అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో సింగర్ మంగ్లీ పేరును A5 నిందితురాలిగా చేర్చారు. అయితే ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని మంగ్లీ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అసలు మైక్రో ఫైనాన్స్ కేసుకి తనకు ఏమాత్రం సంబంధం లేదని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తనపై విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇలా ఈ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బారావు పై మంగ్లీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ కేసు గురించి తన పట్ల వస్తున్నటువంటి తప్పుడు వార్తలను అడ్డుకోవడం కోసమే మంగ్లీ కోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టు నుంచి ఈమెకు ఉపశమనం లభించింది.
Also Read: పెద్ది సెట్స్ లో ఒరిజినల్ పెద్ది…స్పెషల్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్!