E-Paper
Advertisement

పెద్ది సెట్స్ లో ఒరిజినల్ పెద్ది…స్పెషల్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్!

పెద్ది సెట్స్ లో ఒరిజినల్ పెద్ది…స్పెషల్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్!
Advertisement

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పెద్ద సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. మరోవైపు చిత్ర నిర్మాతలు సైతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

పెద్ది సెట్స్ కి వెళ్లిన చిరంజీవి..

తాజాగా నటుడు రామ్ చరణ్(Ramcharan) ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పెద్ది సెట్ కి వెళ్లినటువంటి వీడియోని తాజాగా రామ్ చరణ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈయన “ఒరిజినల్ పెద్ది ఆన్ ద సెట్ ఆఫ్ పెద్ది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అసలైన పెద్ది చిరంజీవి గారు పెద్ది సెట్స్ కి వచ్చారని తెలియజేశారు.

పెద్దిరన్ టైం లాక్..

Advertisement

చిరంజీవితో పాటు మరొక పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా పెద్ది సెట్స్ లో ఉండటం విశేషం. ఇలా వీరందరితో కలిసి చిరంజీవి సినిమాకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక పెద్ది సినిమా ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి కావడంతో సినిమా రన్ టైం దాదాపు 3 గంటల20 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈనెల 17వ తేదీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు .అయితే ఈ ట్రైలర్ మాత్రం మన ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఇండోర్ లేదా పాట్నాలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

?igsh=a3k4bTl2cWM1a28%3D

Advertisement

జూన్ 4వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కాబోతుండగా జూన్ మూడో తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లను ప్రసారం చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. జూన్ 4వ తేదీ రాబోతున్న పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా వృద్ధిస్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించారు.

Also Read: నేను బ్రతికే ఉన్నాను.. ప్లీజ్ చంపేయొద్దు.. సోషల్ మీడియా పై ఫైర్ అయిన శక్తి కపూర్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×