E-Paper
Advertisement

JETLEE : కమెడియన్ సత్య సినిమా కోసం ఏకంగా వారణాసి సినిమాను వాడుకుంటున్నారు

JETLEE : కమెడియన్ సత్య సినిమా కోసం ఏకంగా వారణాసి సినిమాను వాడుకుంటున్నారు
Advertisement

JETLEE : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో సత్య ఒకరు. సత్య టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సాధించుకున్న సత్య సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా చేసిన స్వామిరారా సినిమాతో మంచి పేరును సాధించుకున్నాడు. చిన్న సినిమాకు వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పటి నుంచే చిన్న సినిమాలు గురించి చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు.

కొన్ని సినిమాల్లో సత్య కనిపించేది తక్కువ అయినా కూడా అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాడు. అతని టాలెంట్ ను సరిగ్గా వాడుకునే దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా రితీష్ రానా మాత్రం సత్య టాలెంటును విపరీతంగా వాడుకుంటాడు. రితీష్ దర్శకత్వంలో మత్తు వదలరా సినిమా వచ్చింది. ఆ సినిమాలో సింహ మరియు సత్య నటించారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

వారణాసి సినిమాను వాడుకుంటున్నారు 

Advertisement

ఇకపోతే మళ్లీ సత్య మత్తు వదలరా 2 సినిమాలో కూడా కనిపించాడు. ఈ సినిమాకి కూడా విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. మత్తు వదలరా సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇక ప్రస్తుతం కమెడియన్ సత్య హీరోగా రితీష్ రానా దర్శకత్వంలో జెట్లీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేసినప్పుడే బాగా వైరల్ అయింది. విమానంపై సత్య నిలుచున్న స్టిల్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది.

Advertisement

సత్య ఫోన్ చూస్తూ ఉంటాడు దానిలో పోస్టర్ కు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చదువుతాడు. అది మన సినిమాకి కాదు వారణాసి సినిమాకి అని పక్క నుంచి రితీష్ రానా చెబుతాడు. మొత్తానికి మహేష్ బాబు సినిమాని వాళ్ళ ప్రమోషన్ లో కలిపేశారు. అలానే సినిమాలో నువ్వు హీరో కాదు వెన్నెల కిషోర్ హీరో అని పక్కనుంచి అంటుంటాడు. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ కామెడీ మరోసారి వర్కౌట్ అయింది.

సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ 

రితీష్ రానా డైరెక్షన్ అంటే చాలామంది కామెడీనే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ పోస్టర్ తోనే సినిమా మీద ఒక రకమైన క్యూరియాసిటీ చాలామందికి పెరిగిపోయింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా మీద కూడా కొంతమంది విపరీతమైన క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Also Read: Bigg Boss 9 : బాబు నీ హెల్త్ బాలేదు నువ్వు బయటికి వెళ్లిపో, ఇదెక్కడి నామినేషన్ సుమన్ అన్న?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×